Thursday, June 13, 2013

అక్"శరము"

కావు నా అక్షరాలు కాగితాల పూలు 
కావు నా అక్షరాలు ప్రియురాలికి మురిపాలు 
కానే కావవి పసిపిల్లల లుల్లాయిలు 
మరి కావవి 
అభినందన హారాలు 
ప్రశంసల పదమాలలు 
గిలిగింతల కవ్వింతలు 
సిరిమంతుల ధనవంతుల పొడగింతలు 

కావు నా అక్షరాలు కాగితాల పూలు 

చీలు నాల్కెలు చాచు
నిజము క్రక్కె త్రాచులు 
బొంక నేర్చిన మనిషి 
డొంక కదిలించును 

చిమ్మ చీకటి చాటు 
మెరిసె మినుగురులు 
చీకటంతటిని చెరిపి 
వెలుగు విరజిమ్మును 

నేటి రావణుల చీల్చు 
నాటి రామబాణాలు 
వాటి ధాటికి నిలువ ఎవరుండును 

నా పదము 

చండ సూర్యుని రధము 
వీరభద్రుని పదము 
కృష్ణసఖుని ధన్వము
ప్రళయ మేఘ ధ్వనము 

నా అక్షరాలు

కొదమ సింహపు జూలు 
మదపుటేనుగు కేలు
కామధేనువు పాలు 
ఎడారి చలమల నీళ్ళు 

కావు నా అక్షరాలు కాగితాల పూలు... 
మహర్షి 

Monday, June 10, 2013

ప్రయత్నం

ప్రతీ రోజు,ప్రతీ గంట,ప్రతీ నిమిషం,ప్రతీ క్షణం 
ప్రయత్నిస్తునే  వున్నాను 

జనమంతా గర్వించే ఏదో గొప్ప విజయాలు సాదించాలని కాదు
మరెదొ అసాద్యాన్ని సాద్యం చేయాలని కాదు 
అందని ఆకాశ తారల్ని అందుకోవాలని కాదు 
అనంతమైన ఐశ్వర్యాలను దండుకొవాలని కాదు 

కేవలం 
ఒక్క క్షణమైన నిన్ను తలవకుండ ఉండాలని 
అలుపులేని నా కన్నీటి జడిని ఆపి ఉంచాలని  
విరుగుతున్న నా మదిని అతికి ఉంచాలని  
నీవు లేని నా జీవితాన్ని బ్రతికి ఉంచాలని...!
మహర్షి 

Saturday, June 8, 2013

నా "చెలి" నా "కాగితం"

నా చెలి పెదాలు ముద్దాడినంత
సుకుమారంగా 
నిన్ను ముద్దాడతాను కలంతొ
సిగ్గుతొ నా చెలి చెక్కిళ్ళు ఎరుపెక్కితే
నీవు నిలువెల్ల నీలిమయమవుతావు
నా చెలి కురులు నిమిరినంత
మృదువుగా
తన్మయత్వంతొ 
నా వేళ్లు నీపై నాట్యమాడతాయి  
పూరేకులతొ నా చెలి అరికాలిన చెక్కిలిగిలి చేసినట్లు 
నీ అనువనువున అక్షరాల కవ్వింత కలిగిస్తాను 
నా చెలి కళ్లలొ లక్ష నక్షత్రాలను చూసినట్లు
నీలొ నా ఆలోచనల అక్షత్రాలను చూస్తాను 
నా చెలి కలయికలొ పరవశించినట్లు 
నీ కలయికతొ ప్రశాంతిస్తాను 
నా చెలి నా యదలొపల కొలువుంటె 
నీవు నా లోపలి యదసడికి రూపమిస్తుంటావు
నా చెలి నా కాగితం,నా కాగితం నా చెలి. 
మహర్షి

Wednesday, June 5, 2013

వ్యధ

ఆకాశం అరిగిపొయెల మనపేర్లు లిఖించాను
ఎవరు చెరపకుండ 
బదులుగ నాకు ధక్కింది 
ఆకాశమంత ఆవేదనె  
అందుకే 
దిక్కులు పిక్కటిల్లెల అరుస్తున్నాను
ఎవరికి వినిపించకుండ
భూమి బద్దలయ్యెల తాండవిస్థున్నాను  
ఎవరికి కనిపించకుండ 
సముద్రాలు పొంగిపొయెల రొధిస్తున్నాను
ఎవరు గమనించకుండ 
కాలం వెనకపడెల పరుగుతీస్తున్నాను 
ఎవరు పట్టుకోకుండ
క్షణక్షణం కాలిపోతున్నాను 
ఎవరు చితిపేర్చకుండనే
మహర్షి