Saturday, February 6, 2010

ఎలా...?

నిప్పుల్లొ నిలబడిన చెలించని నన్ను
వదలని నీ ద్యాస దహించేస్తుంది
ఏబందానికి అందని నన్ను
నీ బంధం బందీని చేస్తుంది
ఏభావనకి చదరని నేను
అందని నీ ఆదరనకై ఆరాటపడుతున్నా
ఏఅస్త్రము చేదించని నా గుండెను
నీ చూపుల చురకత్తులు చీల్చెస్తున్నయి
ఆవేషం తప్ప ఆలొచనలేని నన్ను
అనుక్షణం నీకై ఆలొచింపచేస్తున్నవు
రౌద్రంగా వుండే నా కన్నులు నేడు నిర్మలంగా
నీకై కలలు కంటున్నాయి
మౌనంగా మట్లాడే నా పెదవులు
నీ పేరును కాక మరేమి పలకటంలేదు
నాకే తెలియకుండా నన్ను సైతం నీకు అనువుగా మార్చుకుని
నీకేమి తెలియదంటె ఎలా...?
 మహర్షి 

Wednesday, February 3, 2010

కష్టం

అచ్చుతప్పు కష్టాలు

మద్యహ్నం నిదుర లేచేవాడికి ఉదయాన్నె లేవడమె మహాకష్టము
ఎండాకాలంలొ ఎ.సి పనిచేయకపోయిన సీతాకాలంలొ హీటర్ పనిచేయకపోయిన అదే అతిపెద్ద కష్టము
ఏసంధర్బంలొ ఏబట్టలు వేసుకొవాలొ తెలియని విచిత్రమైన కష్టం
బలాదూరు తిరుగుతున్న సమయంలొ బైకు ఆగిపొతె భరించలేని కష్టం
పదివేల పాకెట్ మనీలొ ఒకవెయ్యి తగ్గితె తీవ్రమైన కష్టం
కష్టానికె కష్టమైనంత కరీదైన కష్టం.....


అసలైన కష్టాలు

నకనకలాడుతున్న పేగులతొ బుక్కెడు బువ్వకి భిక్షమెత్తుకునె
పసివాడిని అడుగు కష్టమంటె
తలపైన తట్ట, తట్టనిండ ఇటుక,
ఇటుక ఒకటి జారి కాలివేలు నలిగితె
నల్లమట్టి చల్లి నెత్తురానకట్ట కట్టి
నలపై మెట్లెక్కె కూలీని అడుగు కష్టమంటె

నడినెత్తిన సూరీడు నడుముపైన మూట
మూటదింపి ఇంటికెల్లి మెతుకు మింగి పడుకుంటె
కమిలిపోయిన వీపుతొ కునుకైనా రాని
కార్మికుడిని అడుగు కష్టమంటె

వేలువేలు అప్పుతెచ్చి పొలం దున్ని పంటవేసి
పంటమొత్తం పురుగు పడితె
పురుగుమందు తెచ్చి కొట్టిన పంట చేతికి రాకపోతె
ఉరితాడుకు ఊయలూగిన రైతునడుగు కష్టమంటె

లోకమంతా వెక్కిరిస్తె,వెక్కి వెక్కి
ఏడుస్తున్న వినిపించక
కన్నబిడ్డను చెత్తకుప్పల విసిరివేసిన
కన్యతల్లిని అడుగు కష్టమంటె

విసిరివేసిన విస్తర్లలొ
వెతికి వెతికి మెతుకు మింగి
బతుకునీడ్చుటకు అలమటించే
అనాదనడుగు కష్టమంటె
 మహర్షి