Tuesday, January 31, 2012

ఎన్నటికి మారవు..


హరిదిక్కునుదయించి అపరదిశనస్తమించడం
సూర్యుడు
ఘృతాచమున మిరమిర మెరుపుల్ మెరిసి 
అంశకమున అంతర్దానమవడం 
నక్షత్రాలు 
ద్విపక్షమంతనూ భువికి వెలుగునందించి
మాసమునకోసారి చీకటిపాలవడం 
చంద్రుడు 
నిత్యం అంబరాన్నందుకొవాలని ఆశపడి అలిసిపోవడం 
కెరటాలు 
తొలిప్రొద్దు వికసించి మలిప్రొద్దు వాడిపోవడం 
పువ్వు 
ఒక హృదయాన విషాదం మరు హృదయాన  ప్రహ్లాదం
రెండింటికి కారణమవడం  
ప్రేమ   
మహర్షి


Tuesday, January 10, 2012

ఏవైపు.?




ఒకవైపు దేశం దహనమైపోతుంది
మరోవైపు మన యువత నిద్రిస్తున్నారు 
ఒకవైపు దుండగుల దండు దేశాన్ని దండుకుంటుంది
మరోవైపు దండగ పండగల ప్రజలు పరవసిస్తున్నారు


ఒకవైపు ఆకలి డొక్కల కేకలు
మరోవైపు పబ్బుల డబ్బుల షోకులు
ఒకవైపు గతుకుల దారిన అతికిన బతుకులు
మరోవైపు తారు దారుల కరీదు కారులు


ఒకవైపు శిదిలాలకు ప్రాణం పొసే కలాకారులు
మరోవైపు మద్యానికి ఆజ్యం పొసే చరిత్రకారులు 
ఒకవైపు ధర్మస్తాపనకై నిరహారదీక్షలొ నీతి పోరాటం
మరోవైపు అధర్మాల  ఆస్తులు పెంచేందుకు అవినీతి అరాటం


ఆవైపా ఈవైపా నీ దారి ఏవైపు.?  
మహర్షి