Saturday, December 7, 2013

జరగని కల..

ఒకసారి వెన్నక్కి వెళ్ళిపో 
ఆనాటి నీ బాల్యంలోకి 
ఆకాశమంత నా ప్రేమను అక్కడి నుండే పరిచయం చేసేలా 
నా దోశిలిలో ఊయల కడతాను  
చెడు నీ దరికి కాదు నీ నీడ దరికి కూడా రానివ్వను 
నీ తొలకరి తోలి అడుగులు నా యదపై వేయిస్తాను 
దూళి నీ పదాన్ని అంటకుండా నా అరచేతులపై నడిపిస్తాను 
వెన్నెలను తెచ్చి వెండి గిన్నెలా కరిగించి 
గోరు ముద్దలు తినిపిస్తాను 
నీ నీరాటముకై స్వాతి చినుకుల మబ్బులు మధించి 
ముత్యాల వాన కురిపిస్తాను 
నా మది ఊయలపై నిదురిస్తున్న నీకు 
నా యదసడిని శృతి చేసి జోలపాడుతాను
నీ కాలక్షేపానికి నేనే నీ ఆటవస్తువును అవుతాను 
నువ్వు కోపంలో విసిరితే విరిగేందుకు వీలుగా 
నా హృదయాన్నిస్తాను 
విరిగిన హృదయాన్ని విరిసిన పువ్వులా 
నీ పాదాల గిలిగింత కలిగేలా నలిగి నీకు నవ్వు కలిగిస్తాను
నీ అడుగులకు లయబద్దంగా నా యదసడిని మార్చుకుంటాను 
నీ ఆత్మకధకు నేను కాగితమవుతాను 
నువ్వు లిఖించే ప్రతీ అక్షరాన్ని
గుండె నాలుగు గదులకు తాళం వేసి దాచుకుంటాను
నిన్ను ప్రేమిస్తున్నానని ప్రతీ క్షణం చెబుతుంటాను
నీ చెవికి కాదు నీ మనసుకు వినిపించేలా
నా ప్రతీ చర్యలో నీపై నా ప్రేమను చూపిస్తుంటాను..
కాని.....!
ఇదంతా ఇలలో జరగని నా కల 
గడిచిన గతం గమనం మార్చుకోదన్నది
జ్ఞాపకాల గాయం ఎన్నటికి మాయమవ్వదన్నది 
ఎంత సత్యమో 
అనంతమైన నా ప్రేమకు నీ అనుమతి లేదన్నదీ
అంతే సత్యం
మహర్షి 

Thursday, November 28, 2013

నేరస్తుడు

నేనొక కరడు గట్టిన కక్షావేక్షకుడను 
నా ఆత్మ కధలో అన్ని కాగితాలు రక్తంలో తడిసినవే 
కోటి కాగితాల చితిలో కలాన్ని,కాలాన్ని తగులబెట్టాను
చీకటి సిరా దారిలో లక్షల అక్షరాల ఆయువు తీసాను 
కలం కత్తి తిప్పుతూ కాగితాల గొంతు కోసాను 
నీలి నెత్తురు కంట చూసాను 
అక్షరాల చిచ్చర పిడుగై 
అచ్చులు,హల్లులు విసురుతూ 
పదాల ప్రాణం తీసాను 
కాగితాల కంఠానికి ఉభయాక్షరాల 
ఉరి వేసి ఊపిరి తీసాను 
పుస్తకపు పన్నాల మద్య అక్షరాన్ని బందించాను 
అక్షరతూలికతో పదాలను తునాతునకలు చేసాను 
కాగితాన్ని గంటంతో గంటలపాటు చిత్రహింస చేసి 
చివరికి చించి పారేసాను 
చేసిన పాపం చెబితే పోతుంది 
కాని 
రాసిన పాపం పగదారి పడుతుంది 
నా పతనానికి ప్రణాళిక లిఖిస్తుంది  
మహర్షి 

Thursday, November 14, 2013

నిన్నటి వెన్నెల

నిన్నలన్నీ మరిచిన వెన్నెల
మరలిరవా నావైపు 
మధురమైన క్షణాలన్నీ మరోసారి మది తాకేలా 
నా వర్తమాన జీవన భావశూన్యంలో 
నా భవిష్యత్తువై 
మూగబోయిన నా హృదయ గానంలో
పద రవళివై 
గతం జ్ఞాపకాల్లో గమనమై 
గతి తప్పిన నా జీవన యానంలో 
నా ప్రాణమై 
అశ్రులవణాల అభిరుచి వీడని ఆదరాలపై 
ఆనాటి ఆనందమై 
కారుమేఘాల చీకటిలో కాలిపోవు 
నా నీడలకై 
వెలుతురై రావా నిన్నటి వెన్నెలవై 
మహర్షి 

Saturday, October 26, 2013

మలుపు

అష్టదిక్కులు కలిస్తే ప్రపంచం
మేము అష్ట సఖులం కలిస్తే మా ప్రపంచం
హద్దులు లేని ఆకాశం మా ఆనందం 
నడి సంద్రంలో అలలు,మా కన్నుల్లో కన్నీళ్లు ఉండవనుకున్నాం 
పాతికేళ్ళ మా ప్రపంచాన్ని అనుకోని అల 
అతలాకుతలం చేసి అందరిని ఆవేదనలో ముంచేసింది 

మా స్నేహితుని పెళ్లని
వధువు రతణాల వల్లని
ఆనందం అక్షింతల్లా జల్లాలని
ఆనాడే మరలి రావాలని
వెళ్ళారు

రాతిరి రారాజు నిద్రలేచాడు
రహదారిలో చీకటి నిద్దరోయింది
రాతిరి రహదారి మలుపులు
ప్రమాదాల తలుపులు
దురదృష్టం తలుపు తీసింది
ప్రమాదం పలకరించింది

రాత్రంతా రంగుల కల 
చీకటి విసిరినా చిక్కుల వల 
చెదిరిన మనసుతో, కన్నీరు కన్నుల

ఘటనలో గతి తప్పి కొందరు
సంఘటన సంగతి తెలియక కొందరు
మిడి జ్ఞానంతో మిడుకుతూ కొందరు

అయోమయాన్ని ఆవేదనతో గుణిస్తే
అదోగతిల మిగిలింది మా స్థితి

కాలానికి తాళం వేయలేము కాని
మా మనసు ఖజానా గొల్లం తీసి
ధైర్యాన్ని కర్చు చేయాలనీ గ్రహించాం

కర్చు చేసిన దైర్యం
మా కాళ్ళను కదిలించింది
నడిపించింది,పరిగెత్తించింది
ఆశని ఆయుధంగా చేసుకుని
కాలంతో కయ్యానికి సిద్దపడ్డాం

శత్రువు బలం అసమానమని తెలుసు
అయినా వదలోద్దంది అందరి మనసు

అదృష్టమో,దురదృష్టమో
గెలుపో, ఓటమో

కాలం ఓడించలేకపోయింది కాని
బలహీన పరచగలిగింది
మా ఆనందం కాలు విరిచి
మమల్ని వికలాంగులను చేసింది

చిరునవ్వు మా చెంతనిక చేరదనుకున్నాం
విషాదం మమ్మల్ని విడువధనుకున్నాం

మదిరెబాబా మాకు మనోదైర్యం ప్రసాదించాడు 
ప్రమాదాన్ని పరిహసించాం 
ఆనందం మా జీవితాల్లోకి వెనుతిరిగి వచ్చేసింది 
కాకపోతే మునుపటిలా పరిగెత్తలేక 
నెమ్మదిగా నడుస్తూ............................................................................
మహర్షి 

Sunday, October 6, 2013

తప్పంతా నాదె

చాన్నాళ్ళయింది నిన్ను చూసి 
ఇన్నాళ్ళలో చాలా దూరమైపోయావు 
దేగ్గరవ్వాలన్న నా ప్రయత్నం 
నలుగురిలో నవ్వులపాలయ్యేంత దూరం 

ఆనాటి రోజుల్ని తలుచుకుంటే
ఆనందంలాంటి ఆవేదన కలుగుతుంది 
గతం తాలూకు జ్ఞాపకాలన్నీ గాజుపలకలే 
ప్రస్తుత ప్రతీక్షణంలో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి 

నన్ను ఆట పట్టిస్తున్నావని అనుకున్నాను 
అలక్ష్యం చేస్తున్నావని గ్రహించలేదు 
నాతొ ఆడుకున్నావని అనుకున్నాను  
నన్నే ఆడుకున్నవని గ్రహించలేదు 

నువ్వు గెలుస్తున్నావని ఆనందించాను 
నన్ను ఓడిస్తున్నావని గ్రహించలేదు 
నీ బంధానికి బానిస చేస్తున్నావని అనుకున్నాను 
బలి చేస్తున్నావని గ్రహించలేదు 

కలవై కవ్విస్తునావని అనుకున్నాను 
కళ్ళలో కన్నీరని గ్రహించలేదు 
మనసు లోతుల్ని గ్రహిస్తున్నావనుకున్నాను 
గాయపరుస్తున్నావని గ్రహించలేదు 

నాలో జీవం పోస్తున్నావని అనుకున్నాను 
నన్ను జీవశ్చవాన్ని చేస్తున్నావని గ్రహించలేదు 

సూక్ష్మంగా గ్రహిస్తే తప్పంతా నాదే 
నీ పేరు ఆనందమనీ తెలుసు...!
నువ్వు అందమైన ముల్లనీ తెలుసు..!
గుండెలోతుల్లో గుచ్చుకుంటావనీ తెలుసు...!

తెలిసి తెలిసి చొరవ చూపాను....
గుండె పగిలి కుమిలిపోయాను...

ఆనందం జ్ఞాపకమైంది
ఆవేదన జీవితమైంది 
నేను జీవశ్చవమయ్యాను..!
మహర్షి

Saturday, September 7, 2013

ఒంటరి తీరం

అమావాస్య చీకటిలొ తీరాన ఒంటరిగా కూర్చున్నాను 
సముద్రంలో అలల్లా 
నా యదలో నీ ఆలోచనలు 
ఎగిసి పడుతున్న అలలు ఎన్నో 
                ఆలిచిప్పలను మోసుకొస్తే 
నీ ఆలోచనలు ఎన్నో 
          అనుభూతులను మోసుకొచ్చాయి 
వడ్డుకోచ్సిన ఆలిచిప్పలలో 
విరిగినవి కొన్ని,
మెరిసినవి కొన్ని,
వింతైనవి కొన్ని
గుర్తుకొచ్చిన జ్ఞాపకాలలో 
ఏడిపించేవి కొన్ని,
నవ్వించేవి కొన్ని,
ఆ రెంటికి నడుమన నన్ను ఉరితీసి కవ్వించేవి కొన్ని 
తిరిగి వెళ్ళిపోతున్న అలను పట్టుకోలేక తీరం 
అలల నురుగు దాచుకునట్లు 
నన్ను వదిలి వెళ్ళిపోయిన నిన్ను అందుకోలేక నేను 
నీ జ్ఞాపకాలు దాచుకున్నాను...
మహర్షి 

Tuesday, July 2, 2013

నీ ప్రేమికుడిని

తెలుసు నాకు అన్ని తెలుసు
నువ్వు మళ్ళి గయపరుస్తావని తెలుసు
నేను మళ్ళి గయపడతానని తెలుసు
తెలిసి మరీ ఎందుకీ సాహసం అంటె 

సాహసం కాదు నా స్వర్దం
తొలి శ్వసకి తుది శ్వసకి 
నడుమన నడిపిస్తున్న 
నా జీవాదారం

వస్తవానికి నేను ఎప్పుడొ జనించినా
జీవంపొసుకుంది మాత్రం నిన్ను చూసిన క్షణమె 
స్పర్సకి చలించడం ప్రకృతికి స్పందించడం నేర్చుకుందీ ఆక్షణమె

మరుక్షణం నిన్ను నా ప్రపంచంగా భావించా 
నీ ఉనికి నా యదసడిలా చేసుకున్నాను 
నీ పేరు నా శ్వాసలా మార్చుకున్నాను 
అనుక్షణం నిన్ను చూడటం తలవటమె 
నా వ్యాపకంగా మారింది 
నువ్వె నా వ్యసనమయ్యావు 
నీ క్షేమం నా భాద్యతగా 
నీ ఆవేదన నా శత్రువుగా 
నీ పెదవులపై చిరునవ్వు నా లక్ష్యంగా 
నీకు మరింత చేరువవ్వాలని 
ప్రతీ క్షణం ప్రయత్నిస్తునే ఉన్నాను 
ఎన్నోసార్లు గేలి చేసావ్
ఎన్నోసార్లు అలక్ష్యం చేసావ్
ఎన్నోసార్లు అవమానపడ్డాను
ఎన్నోసార్లు ఆవేదన చేందాను 
ఎన్నడైనా నా ప్రయత్నాన్ని విరమించానా.?
ఎన్నడైనా నిరాశతో విశ్రమించానా.?
ఎందుకో తెలుసా...?
నీ ప్రతీ చర్య
నా ప్రేమకు బదులనుకున్నాను 
బహుమతి అనుకున్నాను 
అందుకే
నిన్ను ఎప్పుడు ప్రేమిస్తునే ఉన్నాను,
ప్రేమిస్తునే ఉంటాను 
మహర్షి

Thursday, June 13, 2013

అక్"శరము"

కావు నా అక్షరాలు కాగితాల పూలు 
కావు నా అక్షరాలు ప్రియురాలికి మురిపాలు 
కానే కావవి పసిపిల్లల లుల్లాయిలు 
మరి కావవి 
అభినందన హారాలు 
ప్రశంసల పదమాలలు 
గిలిగింతల కవ్వింతలు 
సిరిమంతుల ధనవంతుల పొడగింతలు 

కావు నా అక్షరాలు కాగితాల పూలు 

చీలు నాల్కెలు చాచు
నిజము క్రక్కె త్రాచులు 
బొంక నేర్చిన మనిషి 
డొంక కదిలించును 

చిమ్మ చీకటి చాటు 
మెరిసె మినుగురులు 
చీకటంతటిని చెరిపి 
వెలుగు విరజిమ్మును 

నేటి రావణుల చీల్చు 
నాటి రామబాణాలు 
వాటి ధాటికి నిలువ ఎవరుండును 

నా పదము 

చండ సూర్యుని రధము 
వీరభద్రుని పదము 
కృష్ణసఖుని ధన్వము
ప్రళయ మేఘ ధ్వనము 

నా అక్షరాలు

కొదమ సింహపు జూలు 
మదపుటేనుగు కేలు
కామధేనువు పాలు 
ఎడారి చలమల నీళ్ళు 

కావు నా అక్షరాలు కాగితాల పూలు... 
మహర్షి 

Monday, June 10, 2013

ప్రయత్నం

ప్రతీ రోజు,ప్రతీ గంట,ప్రతీ నిమిషం,ప్రతీ క్షణం 
ప్రయత్నిస్తునే  వున్నాను 

జనమంతా గర్వించే ఏదో గొప్ప విజయాలు సాదించాలని కాదు
మరెదొ అసాద్యాన్ని సాద్యం చేయాలని కాదు 
అందని ఆకాశ తారల్ని అందుకోవాలని కాదు 
అనంతమైన ఐశ్వర్యాలను దండుకొవాలని కాదు 

కేవలం 
ఒక్క క్షణమైన నిన్ను తలవకుండ ఉండాలని 
అలుపులేని నా కన్నీటి జడిని ఆపి ఉంచాలని  
విరుగుతున్న నా మదిని అతికి ఉంచాలని  
నీవు లేని నా జీవితాన్ని బ్రతికి ఉంచాలని...!
మహర్షి 

Saturday, June 8, 2013

నా "చెలి" నా "కాగితం"

నా చెలి పెదాలు ముద్దాడినంత
సుకుమారంగా 
నిన్ను ముద్దాడతాను కలంతొ
సిగ్గుతొ నా చెలి చెక్కిళ్ళు ఎరుపెక్కితే
నీవు నిలువెల్ల నీలిమయమవుతావు
నా చెలి కురులు నిమిరినంత
మృదువుగా
తన్మయత్వంతొ 
నా వేళ్లు నీపై నాట్యమాడతాయి  
పూరేకులతొ నా చెలి అరికాలిన చెక్కిలిగిలి చేసినట్లు 
నీ అనువనువున అక్షరాల కవ్వింత కలిగిస్తాను 
నా చెలి కళ్లలొ లక్ష నక్షత్రాలను చూసినట్లు
నీలొ నా ఆలోచనల అక్షత్రాలను చూస్తాను 
నా చెలి కలయికలొ పరవశించినట్లు 
నీ కలయికతొ ప్రశాంతిస్తాను 
నా చెలి నా యదలొపల కొలువుంటె 
నీవు నా లోపలి యదసడికి రూపమిస్తుంటావు
నా చెలి నా కాగితం,నా కాగితం నా చెలి. 
మహర్షి

Wednesday, June 5, 2013

వ్యధ

ఆకాశం అరిగిపొయెల మనపేర్లు లిఖించాను
ఎవరు చెరపకుండ 
బదులుగ నాకు ధక్కింది 
ఆకాశమంత ఆవేదనె  
అందుకే 
దిక్కులు పిక్కటిల్లెల అరుస్తున్నాను
ఎవరికి వినిపించకుండ
భూమి బద్దలయ్యెల తాండవిస్థున్నాను  
ఎవరికి కనిపించకుండ 
సముద్రాలు పొంగిపొయెల రొధిస్తున్నాను
ఎవరు గమనించకుండ 
కాలం వెనకపడెల పరుగుతీస్తున్నాను 
ఎవరు పట్టుకోకుండ
క్షణక్షణం కాలిపోతున్నాను 
ఎవరు చితిపేర్చకుండనే
మహర్షి

Wednesday, February 27, 2013

శ్వాసించే శవం

నాసిక నడిదారుల్లో అందర్ బాహర్ 
ఆడుతుంది ఉపిరి
స్మశానం నుండి వినిపించక వినిపిస్తున్న  డప్పుల 
సడిచేస్తుంది గుండె 
తెగిపడ్డ బల్లితోక ఊగిసలాడినట్టు 
నటిస్తోంది నాడి 
కాలుతు కదులుతూ,కదులుతూ కాలుతున్న ఉష్ణద్రవంలా 
పారుతుంది నెత్తురు
చరిత్ర చాటే సిదిలాలకంటే 
దృడంగా వున్న యెముకలు
కాలం కంటే చురుగ్గా 
కదులుతున్న కండరాళ్ళు 
బ్రతికున్నావా..? అన్న ప్రశ్నకు
సమాధానంగా ఈ సాక్ష్యం చాలు 
కాని 
జీవిస్తున్నవా ...? అని అడిగితె..!
నువ్వు లేని నేను శ్వాసించే శవంతో సమానం 
అన్నది నా సమాధానం... 
మహర్షి 

Friday, January 4, 2013

బహుత్ హోగయ

శబాష్ శబాష్ శబాష్ 
దేశం కీర్తి ఎక్కడికో... పోయింది 
చాలుచాలు  ఇంకా చాలు 
అరిచి గోల పెట్టింది చాలింక 
ఫేస్ బుక్ లొ షేర్లు,లైక్ లు కొట్టి 
ఉద్దరించింది చాలింక 
చాలా సాదించేసాం ఇప్పటికే 

కావలసినంత ప్రచారం మీడియాకి 
దొరికేసింది
కావలసినంత నిందించె కారణాలు ప్రతిపక్షానికి   
దొరికేసింది 
కావలసినంత ఖండించి విచారించే అంశం అధికార పక్షానికి 
దొరికేసింది 
ఇక జనం 
మనం మాత్రం తక్కువ తిన్నామా 
గోల పెట్టాం,గగ్గోల పెట్టాం 
నినాదాలు ప్రాసలో
కోవోత్తులు వరుసలో 
నిమిషాల పాటు నిశబ్దాలు 
కిలోమీటర్ల పాటు ధర్నాలు 
అంతేనా.!
పత్రికల్లో తెగ చదివేసి 
వార్తాప్రసారాల్లో తెగ చూసేసి 
ఎక్కడ సమయం ఉన్నా 
వృదా చేయకుండా గుముగూడి మరీ 
చర్చించేసి 

విషయం ఇప్పటికే అర్దమై ఉంటుంది 
చీకట్లో బాణాలకు 
మనమంతా అర్జునులమే కదా 

ఇంకా చాలు 
భార్య చాటు భర్తలు 
భర్త చాటు భార్యలు 
కాలం కరిగిపోతుంది 
మీరు మీ సంసారాలు సాగించండి 
మనకసలే సామెతలకు కరువులేదు 
దేశం గొడ్డుపోయిందా అనుకునేలోపు
మరో వంద కోట్ల మూర్కుల్ని,వేదవల్ని 
కనిపారేయండి 

దేశాన్ని నడిపే యువత 
నడిపి నడిపి అలిసిపోయి వుంటారు 
పబ్బుల్లో కాస్త సేదతీరండి 
చెట్టపట్టాలేసుకుని చెడతిరగండి 
సొల్లు కబుర్లతో కాస్త దమ్ము తీసుకోండి 
కొత్త అన్యాయం జరిగేంతవరకు 
ఎక్కువ సమయం పట్టడులెండి 
మన దేశం సమస్యలకు అక్షయపాత్ర 
అందుకే దయచేసి కాస్త విశ్రమించండి 
నా పిచ్చి తల్లి నిర్భయ సైతం అలిసిపోయి 
శాశ్వత నిద్రలోకి జారుకుంది పాపం 

నా అమాయకత్వం కాకపొతే 
మీరు ఒక ఆకు ఎక్కువగానే చదివారు కదా.!
ఆత్మా గౌరవాన్ని ఎప్పుడో విడిచేసారు కదా.!
కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయారు కదా.! 
మరుసటి రోజన్ని  మర్చిపోయారు కదా.! 
నేను గ్రహించనేలేదు.

ఒక్క విషయం మాత్రం కచ్చితంగా తెలుసు 
పక్షపాతం లేని తత్త్వం మీది 
మన దేశంలో అమ్మాయని కాదు 
మన ఇంటి అమ్మాయి అయినా 
ఆకరికి మన భారతమాత అయినా 
మీ వైకరిలో మార్పేమీ ఉండదు కదూ.! 

మ(హి)నుషులరా మీకు మీరే సాటి 
మీ నీచత్వానికి,అసమర్ధతకు 
ఏజంతువు రాదు పోటి.!
మహర్షి 

Wednesday, January 2, 2013

ఎదురుచూపు


వేచాను నేను.. ఈ క్షణానికై
కేవలం క్షణాలు కాదు
ప్రతీ క్షణాన్ని మరో యుగంలా .!
నీకు తెలుసా.?
కాలం ఎంత కటినమైందో...!
క్షణం ఎంత నిర్ధక్షన్యమైందో ..!
సరే వదిలెయ్..
ఉపిరి లేని హృదయాన్ని
సూర్యుడు లేని ఉదయాన్ని
జాబిలీ లేని పున్నమిని
నాడుల్లోన సడిలేని సునామిని
చలనం లేని సముద్రాన్న్ని
గమ్యం లేని బాటసారిని
శవంలా జీవిస్తున్న మనసుని
మనిషిలా నటిస్తున్న శవాన్ని
ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా.?
ఒకేఒక్కసారి అన్ని చూడు
నా బాధ తెలుస్తుంది
లేదా నన్ను చూడు
ఆ ఆవేదన తెలుస్తుంది
ఆకరికి నిరీక్షన ఫలించింది
ఆనందం గొంతు వినిపించింది
పేరు పిలిచి పలకరించింది
ఒక క్షణం హృదయం శ్వాసించింది
ఉధయం వెలుగుపువ్వు పూసింధి
జాబిలి వెన్నెల ఒలకబోసింధి
నాడుల్లొ నెత్తురు ఉరకలేసింధి
కెరటాలతొ సంద్రం ఎగిసిపడింధి
అచ్చం నా మనసులా..
మరోసారి పుట్టిన మనిషిలా ..!
మహర్షి 

Tuesday, January 1, 2013

ఏది నూతనం.?

ఎందుకీ అంబారానంటే సంబరాలు 
ఎంసాదించామని సంతసిస్తూ ఈ సంబరాలు 
ఎంఉద్దరించామని ఊరేగుతూ ఈ ఉత్సవాలు 
నూతన సంవత్సరాన్ని స్వగతిస్తునా 
గతసంవత్సరం గడిచి,విడిచి పోయిందనా.?
అసలు ఏది నూతనం 
పంచాంగాల్లో అంకెలు తప్ప 

మింగమెతుకు లేని బ్రతుకులు
వెన్నుకంటిన డొక్కలు 
మేఘాలకు పాకిని మేడలు
నేలను నాకే పేదలు
నీతి తప్పిన సమాజం 
నిర్వచనం మారిన స్వరాజ్యం 
చలనం లేని జనత
బాధ్యత లేని యువత 
నిజం ఎడారిలో నీటి బిందువు 
అబద్దం అందరికి ఆత్మబంధువు
చట్టాలు న్యాయాలు నమిలూసే కిళ్లిలో కట్టామిట్టాలు 
రాజ్యాంగం మన రాజకీయుల చదరంగం 
మద్యపానమే మన ఆర్దిక వ్యవస్థ మూలాధారం 
అత్యాచారమే దేశరాజదాని ఆచారం 
చెదలు పట్టిన గతం మన చరిత్ర 
చెదపురుగులు మన(o) జనం 
ఇదే మారని మన నిత్యవర్తమానం  


మతి,గతి తప్పిన ప్రభుత్వాలు 
అన్యాయం,అక్రమాల ఆదిక్యత ప్రతీచోట 
జాతి తలదించుకునే ఎన్నో గాధలు 
హవ్వ.! సిగ్గు చేటు 
ఇవేనా మన గర్వకారణాలు 
అందుకేనా ఈ సంబరాలు.?
మహర్షి