Wednesday, November 28, 2012

అన్వేషణ


ఎన్నోరొజులుగా వెతుకుతూనే వున్నాను
అక్షరాలకోసం
పిచ్చివాడు పగటిలొ చుక్కల్ని వెతికినట్లు 
బిచ్చగాడు విసిరేసిన విస్తరిలొ మెతుకులు వెతికినట్లు
పంటవేసిన రైతు ఆకాశంలో మేఘాలు వెతికినట్లు 
తలనెరిసిన శాస్త్రవేత్తలు అంతులేని అంతరిక్షంలొ జీవం వెతికినట్లు 
మందలో దూరమైన దూడ తల్లిని వెతికినట్లు
తిరణాల్లొ తప్పిపోయిన బిడ్డని కన్నవాళ్ళు వెతికినట్లు 
యవ్వనంలొ ప్రేమికుడు నచ్చిన నిచ్చెలి జాడ వెతికినట్లు 
వార్దక్యంలొ దంపతులు మళ్ళీ వారి మద్య ప్రేమని వెతికినట్లు 
మరణిస్తున్న వ్యక్తి తనవాళ్ళని తన చుట్టు వెతికినట్లు 

అవకాశం లేని చోట ఆశతో 
ఆశలేని చోట అవకాశానికై నిరీక్షించి 
అక్షరాల లక్షణాలు కనిపించేంతవరకు 
అవాంతరాలెన్నైనా లక్ష్యపెట్టక వెతుకుతూనే ఉంటాను 
మహర్షి

Friday, November 23, 2012

విశా(ద)ల ప్రపంచం


విశాల ప్రపంచనిర్మాణానికి 
రాళ్ళెత్తిన రౌడీలెవరు 
మానవతాన్ని శవాన్నిచేసి 
సమాజాన్ని స్మశానంచేసిన నాయకులెవరు 
స్మశానాల మీద విశాల ప్రపంచం 
సమాదుల నీడల గోడలు 
శవాల మీద మేడలు 
శిధిలమైన పుర్రెనెత్తురు 
పీల్చి రంగులద్దుకున్నాయి 
ఊలపెట్టే నక్కలు
గుమ్మంలో కుక్కలు 
పునాదుల కింద కుల్లుతున్న యముకలు 
ఇంత తతంగాన్ని చూస్తూ నిలబడ్డ యువకులు 
మన ప్రపంచమని మరిచారో 
మానవ ప్రపంచం అనుకుని వదిలేసారో 
మహర్షి 

Saturday, November 3, 2012

అత్యశ


విసురుతున్న నవ్వుల వెనక 
విరిగిన హృదయాలు ఎవరు చూడగలరు...?
కవ్వించే కన్నుల చాటున 
కనిపించని కన్నీరుని ఎవరు తుడవగలరు...?
గలగలగల మాటల మాటున 
వినిపించని రోదన ఎవరు వినగలరు...?
కారణమైనవారు మాత్రం కచ్చితంగా కారు 
కాని 
మనిషి ఆశాజీవి మనసు అత్యశాజీవి 
 మహర్షి