Tuesday, December 29, 2009




తడబడు నీ మాటలతొ నన్ను తంత్రించావు

ముద్దులొలికే నీ మోముతొ నన్ను మంత్రించావు
కదిలే నీ కనుపాపలతొ నన్ను కట్టిపడేసావు

నాగులాంటి నాసిక ఉచ్వాసలొ నన్ను నిర్బంధించి
నిశ్వసలొ నా ఊపిరి తీసావు
నర్తించే నీ అడుగుల సవ్వడిలొ నాయదని బంధించావు
నీ కనిష్ఠికతొ నా కంఠనాళన్ని లాగి ముడివేసావు

నీ కటిక చీకటి కురులకరాగ్రుహంలొ నన్ను కబలించావు...
 మహర్షి 

Thursday, December 24, 2009

మరుపు

మరిచిపొ తనతొ నడిచిన నడకని

మరిచిపొ తనతొ నవ్విన నవ్వుని

మరిచిపొ తనతొ కలిగిన చనువును

మరిచిపొ తను పిలిచిన నీపేరుని

మరిచిపొ తను వదిలేసిన నీప్రేమని

మరిచిపొ తనతొ మరిచిపోలేని మధురక్షణాలని

మరిచిపొయె ప్రతీక్షణం మరణిస్తావని మరిచిపోకు....!
 మహర్షి 

Saturday, December 19, 2009

నువ్వునేను


నేను రచైతనైతె నువ్వు నా రచనవి
నేను కవినైతె నువ్వు నా కవితవు
నేను గాయకుడినైతె నువ్వు నా గాత్రానివి
నేను పాటనైతె నువ్వు నా రాగానివి
నేను నింగినైతె నువ్వు నా రంగువి
నేను రాత్రినైతె నువ్వు నా జాబిలి
నేను కెరటమైతె నువ్వు నా తీరానివి
నేను ఉరుమునైతె నువ్వు నా మెరుపువు
నేను దారినైతె నువ్వు నా పరుగువు
నేను నిదురనైతె నువ్వు నా కలవు
నేను చూపునైతె నువ్వు నా కనుపాపవు
నేను ఊపిరైతే నువ్వు నా శ్వాసవు
నేను యదనైతె నువ్వు నా సవ్వడివి
నెను జీవమైతె నువ్వు నా ప్రాణానివి
నేను శూన్యమైతే నువ్వు నా అనంతానివి
నీకేమీ కాని నాకు అన్నీ నువ్వే
 మహర్షి 

Monday, November 23, 2009

మోసం చేసావు..!


ప్రేమించానన్నవు
నాతొ జీవిస్తానన్నవు
నాకోసం మరణిస్తానన్నవు
మాటల మాయాజాలంతొ నన్ను మంత్రించావు

అబద్దాల అంతస్థులు కట్టవు
అక్కడనుండి నన్ను తోసెసావు

కమ్మని ప్రేమని రుచిచూపించావు
ఆకలి అనేలొపు అందులో విషాన్ని కలిపావు

నా జీవితాన్ని నీ వొడిలొ కలగన్నా
కల్లలు చేసి కన్నులను పొడిచేసావు

నీ బంధానికి బంధీని చేసావు
నీ కల్లల కోర్టులొ నన్ను దొషిని చేసావు
నా మనసుకు ఉరిశిక్ష వేసావు
నన్ను మోసం చేసావు...!
 మహర్షి 

Monday, November 16, 2009

ప్రేమిస్తున్న...

నీ నయనాలను ప్రేమించా
నావైపు చూడకపొవా అని

కటికచీకటిని పోలిన నీ కురులను ప్రేమించా
ప్రేమగా నావేలికి అల్లుకుపొవా అని

ఓంకారపు వొంపులు తిరిగిన నీ చెవులను ప్రేమించా
నా మాటలు వినకపోవా అని

నీ అదరాలను మధురాతి మధురంగా ప్రేమించా
నన్ను పలకరించకపొవా అని

నీ పాదాలను ప్రేమించా
నాతొ కలిసి నడిచిరాకపొవా అని

నీ హృదయాన్ని ప్రేమించా
నా హృదయంతొ ఏకమైపొదా అని

చెలీ ...!
నీ ప్రేమ పొందలేని మరుక్షణాన
నేను నా మరణాన్ని ప్రేమిస్తా ....
 మహర్షి 

ఎవరు నేను....?


నా నేత్రం అగ్నిహొత్రం

నా ఉచ్వాసనిశ్వాసలు ఓంకారనాదాలు

నా పలుకులు రామ బాణాలు

నా మనసు అమృతభాండం

నా కోపం అగ్నిపర్వతం

నా శాంతం మంచుపర్వతం

నా ఆవేషం ఆకాశం

నా ఆలొచన పాతళం

పంఛబూతాలు నా ప్రాణాలు

 మహర్షి 

Monday, November 9, 2009

నాలొ నీవు.....

నా నోటికి మాట నీవు
అందులోని మాదుర్యం నీవు

నా పెదవికి చిరునవ్వు నీవు
అందుకు కారణం నీవు

నా కలానికి పదము నీవు
అందులోని ప్రేరణ నీవు 
 మహర్షి 

నా పదానికి పాట నీవు
అందులోని రాగం నీవు

చివరికి
నేను రాసె ప్రతీ కావ్యం నీవు
అందులోని భాష నీవు భావం నీవు మొదలు నీవు ముగింపు నీవె




నా కంటికి చూపు నీవు
అందులోని కను{పసి}పాప నీవు

నాలొని ప్రాణం నీవు
అందులోని ఊపిరి నీవు
చివరికి
నా య్రుదయంలో నీవు
హృదయ స్పందన నీవు నా జీవం నీవు నా సర్వం నీవె

Friday, October 30, 2009

ఆనందం

ఆవేధనల ఆకాశపు అంతస్తుల నుండి
అమంతంగా ఆనందపు అట్టడుగున పడ్డాను
అవదులే లేని అనందంలొ
చమత్కారపు కొండచర్యలు విరిగిపడ్డాయి
ఉన్నట్టుండి ఉల్లసిల్లిపడ్డాను
కష్టాలె ఇష్టమిత్రుడైన నాకు
ఆచోటు ఎదొ అచ్చిరాలెదు
నా దుఃఖాన్ని దూరంగా నెట్టెసారు
అప్పుడె అనుకున్నను
"బాధల వ్యాదితొ నలతపడిన నాకు
Dr.హస్యం ఇచ్చిన కేరింత టానిక్కు
ప్రభావం చూపెడుతుంది" అని
 మహర్షి 

Wednesday, October 28, 2009

మహా కవికి లేఖ

ఓ మహా కవి శ్రీశ్రీ
ఉభయకుసలోపరి అని రాయలేను ఏందుకంటే మీరు స్వర్గంలొ కుశలంగా వుండొచ్చెమొ కాని మెము లెము

ఇక విషయానికి వస్తే నా చిన్నతనం లొ మీరు రాసిన పుడతల్లరా బుడతల్లరా మేదె మేదె ఈలొకం అని విని నిజమేమొ అనుకున్నను, కాని వెల్లిన ప్రతీచొట మీచేత లికించబడిన మనది ఒకబ్రతుకెన కుక్కలవలె నక్కలవలె అని సంబొదించిన కుక్కల గుంపులొ నన్ను కూడ కలిపేసారు...
నిన్ను పునికిపుచ్చుకున్న లక్షనాలు కలిగిన నేను అలా జీవించలేక అగ్గిపుల్ల,సబ్బుబిల్ల కుక్కపిల్ల కాదేది కవికి అనర్హం అని నీవు కవికి ఇచ్చిన రెక్కలను నేను కట్టుకుని కవితా లొకంలొ విహరిస్తూ.. నా కలన్ని కడ్గంగా మార్చి అక్షరపు అనుభాంబులను సమాజపు అవినీతిపై విసరాలనుకున్నాను కాని ఓ మహాకవి నోరులెని జీవలపైనె తప్ప నోరున్న సమాజంపైన నా యుద్దం అంతరాయం కలిగింది ఏందుకు అంటవా.....?
రాజకీయ నాయకులపై విసిరిన నా తొలి అక్షరం పక్కన వున్న స్టెన్ గన్ దాటికి తూట్లుపడిపొయింది.
రౌడీలపై జులిపించిన నా కవితా కడ్గం వాల్లచేతుల్లొని గొడ్డలి పదునుకు తట్టుకోలెక ముక్కలైపొయింది.
ముచ్చటగా మూడవసారి నేను పేల్చిన మతసామరస్యపు తూట మ(త)దపు పిచ్చి పట్టిన మనుషుల పోరులొ పారిన రక్తపుటేరులొ పడి ఊపిరి అందక ఊగిసలాడుతు ప్రాణాలు వదిలింది.
ఇదంతా చూసిన నాకు ఒక క్షణం వెన్నులొ వణుకు పుట్టింది "ఏదొరోజు నన్ను నా కలన్ని కూడ వురితీస్తరెమొ" అని. కాని శ్రీశ్రీ పదాల పాలుతాగి పెరిగిన నాకు భయమెమిటి....? అని ప్రశ్నించుకుని నా అంతరంగాన్ని నీతొ పంచుకోవలని నా దైర్యన్ని పెంచుకొవాలని రాస్తున్నను ఈలేఖ.
నీ ఆవేశపు ఆశీస్సులు నావెంట వుంటాయని ఆశిస్తూ
మీ
అభిమాని
c/o మానవులు
భూమి
 మహర్షి 

జీవితం

ఎంత విచిత్రమైనదొ కదా...
కన్నుతెరిస్తె జనణం కన్ను మూస్తె మరణం...
నడిమద్య జీవితం నాటకం బూటకం అన్నరు
నిజమె మనిషి ఎన్నొ పాత్రలకు ఏకపాత్రభినయం చేస్తు
ప్రపంచపు రంగస్థలం మీద రంగులు పులుముకుని జీవిస్తున్నడు
కాని నిజం ఏమిటంటె ఆరంగులు వెసుకుని వేసుకుని
మనిషి అన్న నిజన్ని మర్చిపొయాడు
తనకే తెలీకుండ తనకు తానే పాత్రకు అన్యయం చేసుకుంటున్నడు
జీవితం అంటె జీవించడం అన్నది మర్చిపొయాడు
కేవలం నటిస్తున్నడు.....!
 మహర్షి 

Tuesday, October 27, 2009

ఏమైందొ తెలియదు...


కాగితం కలం పట్టుకుని కూర్చున్నాను
అంతలొ ఏమైందొ తెలీదు కాని
నిమిషం జరిగిపొతునే వుంది
నాకలం ముందుకు వెల్లటం లెదు
కలం హ్రుదయం లొ సిరా అయిపొయిందా
అని సందెహం కలిగింది నా య్రుదయంలొ
వెనువెంటనె కలం య్రుదయంలొకి
దొంగలా తొంగి చూసాను
వెంటనె నాకలం నాతొ గుసగుసలాడింది
నా నరనరంలొ సిరా ఇంకా వుంది...!
నీ రక్తంలొ అక్షరాల లక్షనాలు తగ్గిపొయాయెమొ
ఒకసారి అనుబంధం,ఆవేదన,ప్రేమ,అనందం,విషాద వైద్యులను కలువు....
 మహర్షి 

Monday, October 19, 2009

నేలకు జారిన నేను...


ఆకాశంలొ అందంగా నేనున్నను
ఉదయ ఉషతొ సాయంత్రపు సంధ్యతొ
దాగుడుమూతలు ఆడుతు
కేరింతలు కొడుతు అలసినవేల
నిషి వడిలొ వొదిగి
చుక్కలు చెక్కిలిపై నిమరగా..
విసనకర్ర వీచికతొ వాయువు...!
దిక్కుల రెక్కలపై ఊగుతు ఊరెగుతు
నిదిరించిన నా కలలొ నిన్ను కాంచి మైమరచిపోయా
నిన్నుచేరాలని వడిగ వడివడిగా అడుగిడి
నిన్ను చేరగా చిరుచినుకై..!
వొంపుసొంపుల హొయలతొ పరుగులు తీస్తు
జలపాతపు వడిలోకి జారి
సముద్రపు కౌగిలిలొ కలిసావు ....
నన్ను కడతేర్చావు ......!
 మహర్షి 

మనిషిగా వున్న మనసుతొలెను
చలణం వున్న చలించలెకున్న
వేదనలొ వున్న రొదించలెకున్న
అతిమెత్తని మనసేవున్న
ఈ ప్రపంచానికి భయపడుతు
పురుషహంకారపు మెకపోతుగాంభీర్యం ప్రదర్షిస్తున్న...
 మహర్షి 

Sunday, October 4, 2009

జీవచ్చవాన్ని.


ఓ చెలి..! నా జీవితకాలం

నీ జ్ఞాపకాల నీడలతో
నిత్యం నీ ఊహలతో
నా హ్రుదయాలయంలో
నిన్ను ఆరాధించానే కానీ..
అందుకోలేని అసమర్దుణ్ణి..
నీకు నాకు మధ్య నిర్మించిన
మత మౌఢ్యాల గోడలను
దూకలెక ఏడ్చిన ఏకాకిని
కులాకుతంత్రాల శిలాశాసనాల్ని
ధిక్కరించలేని దీనుణ్ణి..
ఐశ్వర్య అంతరాలతో
ధనమదాంధుల ఉబ్బలి నీతికి
బలియైపోయిన బక్కప్రాణిని.. వర్గ భేదాల వల్ల కాటిలొ కాలిబూడిదైన జీవచ్చవాన్ని....!
 మహర్షి 


Saturday, September 5, 2009

నేను నీకు ఏమికాను కాని నువ్వు నా ప్రాణం


నాతో సంబాషించడానికి సంకోచిస్తే
నేను నీకు ఏమికాను

నా ఉనికి నిన్ను ఇబ్బందికి గురిచేస్తే
నేను నీకు ఏమికాను

నాకు ప్రతిసారి కృతజ్ఞత చెబితే
నేను నీకు ఏమికాను

నువ్వు చేసిన తప్పుకు క్షమించమని అడిగితే
నేను నీకు ఏమికాను

నన్ను సాయం కోరితే
నేను నీకు ఏమికాను

నేను చెప్పిందిమాత్రమే నువ్వు చేసిననాడు
నేను నీకు ఏమికాను

నా మదిలో మాట నువ్వు తెలుసుకోలేనినాడు
నేను నీకు ఏమికాను

నీ పలుకులు వినకుండా నేను పడుకున్నాను అనుకుంటే
నేను నీకు ఏమికాను

నీ గాయానికి నా నయనం తడిసిందంటే నమ్మడం లేదా
ఐతే నేను నీకు ఏమికాను

మన మొదటి కలయిక నాకు గుర్తులేధనుకుంటే
నేను నీకు ఏమికాను

నీ ఆనందానికి నన్ను నేను సమర్పించుకోలేకపోతే
నేను నీకు నిజంగానే ఏమికాను ....
 మహర్షి 
కాలం RDX లాంటిది
అది ఎప్పుడు వికటిస్తుందో
ఎవరికీ తెలీదు....!
జీవితానికి తప్పదు అంతం
మూగబోయెను నా గాత్రం
బళ్ళున న గుండె విస్ఫోటనం విరుచుకుపడిన సమయాన వీక్షించేందుకు నేను వుండను

 మహర్షి 

Y......O.......U

I wanna be with you

To say i love you

That you may knew

Though you go so far

But I feel you near

And I love you for ever...........
 మహర్షి 

Wednesday, September 2, 2009

నువ్వే ఎదురైతే ప్రియ....!

నీ ముగ్ధ మనోహర రూపం


తలపులో కదలగానే



ఏదో అవ్యక్త మధురగానం


మనసుని చుట్టుకుని


కలవరం కలిగిస్తుంది


నీ ఉహా మదిలో మెదలగానే



ఏదో అద్బుత పరిమళం



బ్రతుకంతా కమ్ముకొని



పరవశం కలిగిస్తుంది



నీ కనుచూపుల జ్ఞాపకం సోకగానే



ఏదో మనోహర ప్రశాంత సుందర దృశ్యం



కళ్ళచుట్టూ ఆవరించుకొని



కాంతి పుంజ ప్రసారాలు చేస్తుంది



నీ పలుకుల మాధుర్యం ఉహించుకోగానే



చల్లని సురభిళ సమీర వీచిక



తనువును మనసునూ సేదతీరుస్తూ పులకరింపచేస్తుంది



ఉహాలు తలపులే ఇంత మంత్ర మోహనంగా వుంటే



ఇక నీవే కనికరించి ఎదురైతే ప్రియ



నా బడుగు హృదయం భరించగాలద....
 మహర్షి 

Sunday, August 30, 2009

మృత్యువు



జీవితపు వలలో నిమిషపు నీటి చుక్కలు జారిపోతున్నాయి....

నా ఆయువు తీరిపోతుంది....!
నా ఉపిరి ఆరిపోతుంది....

మరణం చేరువవ్తుంది............!
 మహర్షి 



Friday, August 28, 2009

నీ తలపులు


ఉదయం సమీపిస్తుంది ప్రియ
నీ జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయి
నీ ఆలోచనల నుండి పారిపోతున్నాను
కాని నా మనసు నన్ను వెంబడిస్తుంది.....!

చీకటి ముంచుకు వస్తుంది ప్రియ
నీ తలపులు గుర్తుకువస్తున్నాయి
మరచిపోవాలి అనుకున్నని
మరణం వెంబడిస్తుంది.........!
 మహర్షి 

నేను కారణమా....?





నా మాటలు నీ మరణానికి కారణమా...?
నే ముగాబోఎవన్నిగా....!
నా చూపులు నీ చావును చూసాయా....?
నే అందుడినయ్యేవన్నిగా....!
నా ప్రాణం నీ ఉపిరితీసింద.......?
వాటిని పంచబూతల్లో కలిపెసేవన్నిగా .....!
నీ హృదయం అతిసున్నితం....
అనుకోకుండా అయ్యాను నీకు దాసోహం.....!
కాని నాలో కలిగింది భయం.....
చూసుకోగాలన నీసుకుమారపు హృదయాన్ని సురక్షితంగా అని.....!
అందుకే
నిన్ను కలవోద్ధనుకున్నాను కాని కడతేర్చలనుకోలేదు ప్రియ.......!
 మహర్షి 

Friday, August 14, 2009


I am falling in love with my grave so
I am walking alone
Cos am a gone geese
I am on the crest
This is the best
I can do for the last
I am falling in love with my grave

 మహర్షి 
ఏంటి నేను ఇలావున్నాను..... నాకెందు ఇంత సున్నితమనస్తత్వం......నేను ఎందుకు అందరినుండి ఏదో ఆశిస్తాను...... ఐనా ప్రేమించాలే కాని అసించకోడదు కదా.... మరి నేనేంటి ఇలా....?



నా అంతరాత్మ.....
నువ్వు అంతేరా ప్రతిమనిషి హృదయం ఒకేలా వుండలేదు కదా... ప్రతిమనిషి మరో మనిషిని ప్రేమిస్తాడు కాని అందరికంటే తనను తాను ఎక్కువగా ప్రేమిస్తాడు అందువల్ల అవతలివారి ప్రేమ లబించకపోయిన చింతించడు...... నువ్వు అవతలివారిని నీకంటే ఎక్కువగా ప్రేమిస్తావు.... నీకంటూ ఏమి మిగలదు హృదయం స్పందించడానికి ప్రేమ అవసరం అది నీవు అవతలివారి నుండి అసిస్తావు కాని ప్రత్రిసారి నిరుత్సాహ పరుస్తుంది కాలం.... అలా అని చింతించకు ఏదో ఒకరోజు ప్రపంచమంతా కాకపోయినా నీవాళ్ళు నిన్ను ప్రేమిస్తారు... నీవు మాత్రం ఎవ్వరిని ద్వేశించకు సుమా....... ఎవ్వరిని ద్వేషించిన గాయం నీ హృదయానికే ..... ఎందుకంటే వారందరి c/o address నీ హృదయం ......
                                  మహర్షి 

Saturday, June 27, 2009



అక్షరము అను శరము
రక్షణలేక శిక్షణ లేని పాలసుల శాస్త్రముగా మారినది

అవివేకులు ఏకమై తలమునంత
నిష్టనికృష్ట అనిష్టము అవర్తరిస్తున్నారు

రాముడి పాలనఏమో......?
రాక్షస పాలన కళ్ళకు కనువిందైనది......

ప్రభువు పరమాత్మ ఐనా ......
దూతలు ధయ్యములాయెను.....!

రక్షణభట్టుల రాజ్యన నిత్యం రాక్షస భటులైతే.........
నరలోకము కాదిది నరకలోకమా అను సందేహము కలిగెను.......!
 మహర్షి 

కవిత by కపిరాజు

కంటికి కాంతి
చెవులకు ధ్వని
నోటికి మాట
శ్వాసకి గాలి
హృదయానికి స్పందన
చేతికి పని కాళ్ళకు నడక
స్త్రీకి ఓక అండ
పురుషుడికో తోడు కావాలంటాడు జండాపై కపిరాజు

Monday, June 15, 2009

ఏమౌతుంది ఈ ధరిథ్రి




ఎందుకొరకు ఈ దరిద్రి ధరిద్రముగా మారుతున్నది
ప్రజాస్వామ్య ప్రభుత్వమప్పుడు ప్రజాహింస రాజ్యమిప్పుడు
పెద్దవాడు పేదకాడు, లేనివాడు పెద్దకాడు
వావివరుసలు తెలియకున్నవి ,కన్నుమిన్ను కానకున్నది
కరుణలేని శవాలన్నీ కాటినుండి వచుచున్నవి
మానవత్వము మచుకైనా కానరాదు మనిషిలోన
నాకు తెలుసు నాకు తెలుసు ఎక్కడున్నదో నాకుతెలుసు
కాటిలోనా కాలుతున్నది సమాజంలో సమాదైనది
శాంతియన్న కాంతి ఒక్కటి కారుచీకటిలోన కలసినది
వేలుతురన్నది లేకపోయినది లోకమంతా చీకటైనది
ఏమౌతుంది ఈదరిద్రి ఇంతకంటే ఇంతకంటే .......!

 మహర్షి 

గమ్యం


అక్షర గమ్యం పదం వరకు
పదం గమ్యం కాగితం వరకు

పలుకు గమ్యం పాట వరకు
పల్లవి గమ్యం చరణం వరకు

శబ్దం గమ్యం నిశ్శబ్ధం వరకు
నిశ్శబ్ధం గమ్యం శబ్దం వరకు

నది గమ్యం సముద్రం వరకు
సముద్ర గమ్యం తీరం వరకు

చీకటి గమ్యం వెలుగు వరకు
సూర్యుడి గమ్యం పడమర వరకు

ఆశ గమ్యం అంబరం వరకు
అత్యాశ గమ్యం అనర్ధం వరకు (అంతం వరకు )

వయసు గమ్యం వలపు వరకు
ప్రేమ గమ్యం పెళ్లి వరకు

గురి గమ్యం లక్ష్యం వరకు
ఓటమి గమ్యం గెలుపు వరకు

బాధ గమ్యం ఏడ్పు వరకు
ఒంటరి గమ్యం తోడు వరకు

మనిషి గమ్యం మరణం వరకు
కీర్తి గమ్యం అనంతం వరకు

 మహర్షి 

కవిత

మదిలోని కళలు
కధనముగా మర్చి
కధనమును కారమునకు చేర్చి
కాలమునకు జార్చి సిరముగా మర్చి
కాగితమున కూర్చునది కవిత్వము
 మహర్షి