Sunday, March 13, 2011

తెలవారింది...


రబ్బర్ తొ తుడిచేసిన పేజీ లాంటి ఆకాశం
నల్లమబ్బుల మరకలు అక్కడక్కడ నిలిచిపొయాయి
చిల్లు పడిన చూరు నుండి ఒక్కొ చుక్క తొంగి చూస్తుంది
చంద్రుడి చెలి పౌర్ణమి వీడిపోయింది కాబొలు 
బక్కచిక్కి పొయాడు 
చీకటి నల్లటి దుప్పటి కప్పి 
అందరిని పడుకోమంది 
అప్పటివరకు సందేహంతొ సంకోచిస్తూ 
గుమ్మంలొ గస్తికాస్తున్న నిద్దుర 
ఆవలింత ఆహ్వానించగా 
పరిగెత్తుకు పక్కనొచ్చివాలింది 
అంతలొనే సూరీడు వెచ్చటి గొంతుతో
గట్టిగా పిలిచాడు తెలవారిందని 
మహర్షి