Thursday, June 10, 2010




నీవులేవని తెలిసిన క్షణం నుండి
మరణించాలని వుంది
మనికట్టు నుండి
నెత్తురు చిందించాలని వుంది
కాని నీకిచ్చిన మాట దాటలేక
నీకు నచ్చిన నాచిరునవ్వు
గుర్తుల్ని చంపలేక
నా యదగాయాలను నీవిచ్చిన దరహాసంతొ దాచేస్తున్న
 మహర్షి 

Tuesday, June 8, 2010

జీవితం

జన్మిస్తాం మరణిస్తాం మద్యలొ మరి ఏంచెస్తాం
కొందరన్నారు జీవిస్తామని,ఇంకొందరన్నారు నటిస్తామని
మరికొందరన్నారు పొరాడతామని.
సందిగ్ధసమాదానానికి అప్పుడె పుట్టిన బిడ్డ ప్రశ్న
కేరు కేరున కేకలు పెడుతుంది నన్నేది నమ్మమని
ఇంతలొ సమదానం చెబుతానంది సమాజం

జీవించడానికి పొరాడెవారు కొందరు
పొరాడేందుకె జీవించేవారు కొందరు
జీవితంలొ నటించేవారు కొందరు
నటిస్తూ జీవించేవారు కొందరు

జీవించినా,పొరాడినా,నటించినా
పుట్టుకకి మరణానికి ఒక్కటే అందరు

జన్మించేది తల్లివొడిలొనే...
మరణించేది మట్టివొడిలొనే...!
 మహర్షి