ఓ మహా కవి శ్రీశ్రీ
ఉభయకుసలోపరి అని రాయలేను ఏందుకంటే మీరు స్వర్గంలొ కుశలంగా వుండొచ్చెమొ కాని మెము లెము
ఇక విషయానికి వస్తే నా చిన్నతనం లొ మీరు రాసిన పుడతల్లరా బుడతల్లరా మేదె మేదె ఈలొకం అని విని నిజమేమొ అనుకున్నను, కాని వెల్లిన ప్రతీచొట మీచేత లికించబడిన మనది ఒకబ్రతుకెన కుక్కలవలె నక్కలవలె అని సంబొదించిన కుక్కల గుంపులొ నన్ను కూడ కలిపేసారు...
నిన్ను పునికిపుచ్చుకున్న లక్షనాలు కలిగిన నేను అలా జీవించలేక అగ్గిపుల్ల,సబ్బుబిల్ల కుక్కపిల్ల కాదేది కవికి అనర్హం అని నీవు కవికి ఇచ్చిన రెక్కలను నేను కట్టుకుని కవితా లొకంలొ విహరిస్తూ.. నా కలన్ని కడ్గంగా మార్చి అక్షరపు అనుభాంబులను సమాజపు అవినీతిపై విసరాలనుకున్నాను కాని ఓ మహాకవి నోరులెని జీవలపైనె తప్ప నోరున్న సమాజంపైన నా యుద్దం అంతరాయం కలిగింది ఏందుకు అంటవా.....?
రాజకీయ నాయకులపై విసిరిన నా తొలి అక్షరం పక్కన వున్న స్టెన్ గన్ దాటికి తూట్లుపడిపొయింది.
రౌడీలపై జులిపించిన నా కవితా కడ్గం వాల్లచేతుల్లొని గొడ్డలి పదునుకు తట్టుకోలెక ముక్కలైపొయింది.
ముచ్చటగా మూడవసారి నేను పేల్చిన మతసామరస్యపు తూట మ(త)దపు పిచ్చి పట్టిన మనుషుల పోరులొ పారిన రక్తపుటేరులొ పడి ఊపిరి అందక ఊగిసలాడుతు ప్రాణాలు వదిలింది.
ఇదంతా చూసిన నాకు ఒక క్షణం వెన్నులొ వణుకు పుట్టింది "ఏదొరోజు నన్ను నా కలన్ని కూడ వురితీస్తరెమొ" అని. కాని శ్రీశ్రీ పదాల పాలుతాగి పెరిగిన నాకు భయమెమిటి....? అని ప్రశ్నించుకుని నా అంతరంగాన్ని నీతొ పంచుకోవలని నా దైర్యన్ని పెంచుకొవాలని రాస్తున్నను ఈలేఖ.
నీ ఆవేశపు ఆశీస్సులు నావెంట వుంటాయని ఆశిస్తూ
మీ
అభిమాని
c/o మానవులు