ప్రేమించానన్నవు
నాతొ జీవిస్తానన్నవు
నాకోసం మరణిస్తానన్నవు
మాటల మాయాజాలంతొ నన్ను మంత్రించావు
అబద్దాల అంతస్థులు కట్టవు
అక్కడనుండి నన్ను తోసెసావు
కమ్మని ప్రేమని రుచిచూపించావు
ఆకలి అనేలొపు అందులో విషాన్ని కలిపావు
నా జీవితాన్ని నీ వొడిలొ కలగన్నా
కల్లలు చేసి కన్నులను పొడిచేసావు
నీ బంధానికి బంధీని చేసావు
నీ కల్లల కోర్టులొ నన్ను దొషిని చేసావు
నా మనసుకు ఉరిశిక్ష వేసావు
నన్ను మోసం చేసావు...!
మహర్షి