Monday, November 16, 2009

ప్రేమిస్తున్న...

నీ నయనాలను ప్రేమించా
నావైపు చూడకపొవా అని

కటికచీకటిని పోలిన నీ కురులను ప్రేమించా
ప్రేమగా నావేలికి అల్లుకుపొవా అని

ఓంకారపు వొంపులు తిరిగిన నీ చెవులను ప్రేమించా
నా మాటలు వినకపోవా అని

నీ అదరాలను మధురాతి మధురంగా ప్రేమించా
నన్ను పలకరించకపొవా అని

నీ పాదాలను ప్రేమించా
నాతొ కలిసి నడిచిరాకపొవా అని

నీ హృదయాన్ని ప్రేమించా
నా హృదయంతొ ఏకమైపొదా అని

చెలీ ...!
నీ ప్రేమ పొందలేని మరుక్షణాన
నేను నా మరణాన్ని ప్రేమిస్తా ....
 మహర్షి