Tuesday, December 29, 2009




తడబడు నీ మాటలతొ నన్ను తంత్రించావు

ముద్దులొలికే నీ మోముతొ నన్ను మంత్రించావు
కదిలే నీ కనుపాపలతొ నన్ను కట్టిపడేసావు

నాగులాంటి నాసిక ఉచ్వాసలొ నన్ను నిర్బంధించి
నిశ్వసలొ నా ఊపిరి తీసావు
నర్తించే నీ అడుగుల సవ్వడిలొ నాయదని బంధించావు
నీ కనిష్ఠికతొ నా కంఠనాళన్ని లాగి ముడివేసావు

నీ కటిక చీకటి కురులకరాగ్రుహంలొ నన్ను కబలించావు...
 మహర్షి 

Thursday, December 24, 2009

మరుపు

మరిచిపొ తనతొ నడిచిన నడకని

మరిచిపొ తనతొ నవ్విన నవ్వుని

మరిచిపొ తనతొ కలిగిన చనువును

మరిచిపొ తను పిలిచిన నీపేరుని

మరిచిపొ తను వదిలేసిన నీప్రేమని

మరిచిపొ తనతొ మరిచిపోలేని మధురక్షణాలని

మరిచిపొయె ప్రతీక్షణం మరణిస్తావని మరిచిపోకు....!
 మహర్షి 

Saturday, December 19, 2009

నువ్వునేను


నేను రచైతనైతె నువ్వు నా రచనవి
నేను కవినైతె నువ్వు నా కవితవు
నేను గాయకుడినైతె నువ్వు నా గాత్రానివి
నేను పాటనైతె నువ్వు నా రాగానివి
నేను నింగినైతె నువ్వు నా రంగువి
నేను రాత్రినైతె నువ్వు నా జాబిలి
నేను కెరటమైతె నువ్వు నా తీరానివి
నేను ఉరుమునైతె నువ్వు నా మెరుపువు
నేను దారినైతె నువ్వు నా పరుగువు
నేను నిదురనైతె నువ్వు నా కలవు
నేను చూపునైతె నువ్వు నా కనుపాపవు
నేను ఊపిరైతే నువ్వు నా శ్వాసవు
నేను యదనైతె నువ్వు నా సవ్వడివి
నెను జీవమైతె నువ్వు నా ప్రాణానివి
నేను శూన్యమైతే నువ్వు నా అనంతానివి
నీకేమీ కాని నాకు అన్నీ నువ్వే
 మహర్షి