Tuesday, October 12, 2010

అనందానికి అడ్డుగా నాకు నేనే గిరిగీసుకున్న
బాహ్యప్రపంచాన్ని బహిష్కరించేస్తున్న
విషాద వీషూచికతొ విహరిస్తున్న
నిషీది నిషబ్దంలొ నిశ్చేష్టగా వున్న
నా అరచేతి గీతలు,నా తలరాతలు
తలరాతల చేతలు నా కవితలు
విషాదాల భింబాలై మస్తిష్కాన్ని ఆక్రమించేసాయి
 మహర్షి 

Monday, October 11, 2010

నన్ను నేనే కడతేర్చుకుంటున్నా
నన్ను నేనే హతమార్చుకుంటున్నా
నాలోని చీకటి చెలిని కౌతుక ఖడ్గంతో వదిస్తున్నా
నా ప్రియ కాంత ఏకాంత కాంతను ఆనందనందకంతో అంతమొందిస్తున్నా
ఉన్న ప్రేమని లేదని లేని ద్వేశాన్ని ఉందని
మార్దవమగు నా మదికి కఠినత్వపు రంగులు చిమ్మి భయటకు గెంటేసా
నా కోమలత్వం కనబడకుండా నిర్బటము నటిస్తున్నా
కాని ఎందుకు నేనిలా.?
అర్దం కాని అలొచనలా,అంతులేని అవేషాలా,అపార్దల అహలా..?
 మహర్షి