జాబిల్లిని చూస్తు నిద్దురపోయిన నన్ను
పొద్దువాలగానే నిద్దుర లేపింది ఒక ఆర్తనాదం
ఒక్కసారిగా కనులు తెరచి తలుపు తెరిచా
మంచుతో మసికొట్టుకుపొయింది ప్రపంచం
ముంగిలిలొ ముద్దుగా దిద్దిన ముగ్గులు
మురుస్తూ ముందుకు వెళ్లిన నాకు
మరింత చేరువలో చెవిని చేరింది ఆర్తనాదం
అటుపక్క ఒక అడుగు వేసా
రక్తపుమడుగులో పడివున్న వార్తావనిని చూసి
వొనుకు పుట్టింది వెన్నులొ
వెన్నులో భయన్ని తాకట్టుపెట్టి
అప్పుతెచ్చుకున్న దైర్యాన్ని కర్చుపెట్టి
ఆపన్నహస్తం అందించి హక్కున చేర్చుకున్నాను
అప్పుడు చెప్పింది నన్ను అబ్బుర పరిచిన
తన ఆవేదన అంతా
అక్కరకు రాని నిజాలు
అంతులేని అబద్ధాలు
మానవ మృగాల చేతలు
అవి తోసిపుచ్చే నేతలు
కుంభకోణాల లోతులు
రాజ్యంగానికి పడ్డ గోతులు
భరించలేని అక్రమనుబంధాల బూతులు
మనిషి చేసే మారణహొమ తీవ్రతలు
సాగుతున్న సమ్మెలు
శిధిలమైన బొమ్మలు
దారులన్ని గతుకులు
భారమైన బతుకులు
అక్షరాల మూటలొ అన్ని కలిపి నాపైమోపి
మెడపట్టుకుని వీదిలోకి విరిసిపారేసారని.....!
మహర్షి
No comments:
Post a Comment