ఈక్షణం భ్రమించే భూమి స్థంభించిపొవాలి
ఒకేఒక్కసారి వ్యతిరేక దిసగా తిరగాలి
ఆనాటి రాతి యుగానికి కాదు
క్రీస్తు యుగానికి కాదు
కేవలం నీతొ గడిపిన నిన్నటి క్షణాల వరకు
నేనే నీ ఏకైక స్నేహమైన ఆనాటి కాలానికి
అనుమానాలకి తావులేని నీ పసిమనసు ప్రాయంలోకి
నా ప్రపంచం నీవైన ఆ ప్రపంచంలొ,
నాతొ పాటు ఆనందించిన జ్ఞాపకాల గతంలొకి
నిత్యం నే గెలిచే అంతక్షరిలో నీతొ నేనోదిన నిమిషాల్లొకి
నింగి ఎండను నీమీద పడకుండా
నీకే తెలియకుండా
నీడలా నీవెనక నడిచిన నిరుడుదారుల్లొకి
ఎంత అవివేకినో కదా మరి నేను..?
పూడ్చేసిన గతాన్ని తవ్వగలనే కాని
మరణించిన మధురానుభూతికి ప్రాణం పోయాలేను కదా మరి...!
మహర్షి
3 comments:
ప్రేమించిన ప్రతి మనసూ చేసే ఆలోచనని మాటల్లో భావుకత తో చక్కగా చెప్పారు. బావుందండీ!
so good....
thanku @chinni gaaru @ manusri gaaru
Post a Comment