కాలం కాళ్ళు విరగొట్టాలనుంది
నిమిషాల మెడలు విరిచేయాలనుంది
గతాన్ని తగులబెట్టేయాలనుంది
జ్ఞాపకాలు కాల్చేయాలనుంది
అక్షరాలను విసిరేయాలనుంది
అనంతాన్ని చెరిపేయాలనుంది
సూర్యున్ని మసిచేయాలనుంది
సంద్రాన్ని కసిగా ముంచేయాలనుంది
యెడారిని ఒంటరిగా వదిలేయాలనుంది
రాత్రిని చీకట్లో బందించాలనుంది
చుక్కల్ని ఆర్పేయాలనుంది
చంద్రున్ని దహించాలనుంది
అసలు ఎందుకు
నువ్వు లేవని తెలుస్తుంది
అనుక్షణం నన్నానిజం తొలుస్తుంది
ఎంతలా అంటే
హృదయాన్నే ఉరితీయాలనుంది
మదిలయనే ఆపేయాలనుంది
మహర్షి
ఒహొ వచ్చెసింది దేశానికి స్వాతంత్రం
ఒహొ ఇంక సరంజామ సిద్దం చేయండి
అక్కడెక్కడొ ఇంట్లొ మూలన పడ్డ ట్రంకుపెట్టనుండి
దేశభక్తిని తీసి పట్టిన దుమ్ము దులపండి
వీదికి వీదికి మద్య గిరిగీయండి
మలుపు మలుపు మద్యలో సరిహద్దులు నిర్మించండి
ఒక గుంజ తీసుకుని శుభ్రం చేయండి
చుట్టుపక్కల అందరికంటే ఎత్తుండేలా చూడండీ
మర్కేట్టుకు మరొకడిని పురమయించండి
గుర్తుచేసుకోండి మన జండలోని రంగుల్ని
అదే పోలికలో ఒక మీటరు గుడ్డతీసుకోండి
ఒరేయ్ ఒక్కనిమిషం
ఆవీదిలో వాడెవడొ ఒక ఇంచు పొడువు పతాకమట
వాడిని బెదిరించండి కుదరకపోతే బయపెట్టండి
వినకపొతే ఎకంగా లేపేయండి
మన భక్తే గొప్పదవ్వలి
మన జండనే ఎత్తుగా ఎగరాలి
అప్పుడే దేశం బాగుపడుతుంది
అవును అవును చలా బాగుపడి పోతుంది
వీది వీదికో జండా ఎగరేయండి
దేశం బాగుపడిపోతుంది
చెవులు పగిలేలా భరతమాతకు జై కొట్టండి
దేశం బాగుపడిపోతుంది
ఈ ఒక్కపూట వ్యసనాలు వదిలేయండి
దేశం బాగుపడిపోతుంది
ఎగురుతున్న జండాకి ఒక సలాం కొట్టండి
దేశం బాగుపడిపోతుంది
ట్.వీలలో దేశభక్తి సినిమాలు చూసేయండి
దేశం బాగుపడిపోతుంది
చొక్కాకి జండా కాగితం తగిలించేసుకోండి
దేశం బాగుపడిపోతుంది
అందరికి మిటాయి పంచేయండీ
దేశం బాగుపడిపోతుంది
ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తి పొంగిపొర్లించండి
దేశం బాగుపడిపోతుంది
సాయంత్రానికి ఇంక విశ్రమించండి
దేశం సువిశాలాం,సీతలాం,సస్యశ్యమలంగా
బరించలేనంత బాగుపడిపోయింది
మహర్షి
నేనొ హంతకుడిని
నేనొ ఘాతకుడిని
ఒక హృదిని ప్రతీక్షణం ఉరితీస్తున్నవాడిని
ఒక మదిని ఒక్కోక్షణం మదించిపట్టి వదిస్తున్నవాడిని
ఒక యదని అరికాలుతో అనిచితొక్కి అంతంచేస్తున్నవాడిని
ఒక యద అది నాది
ఒక మది అది నాది
ఒక హృది అదీ నాదే
నిజాన్ని తెలుసుకు నివ్వెరపొండి
అశ్చర్యంతో అవిసిపోయెలా అరవండి
నిశ్చేష్టులై నిలవండి
ఇది నా ప్రపంచం
కాదు కాదు
ఇది నా స్మశానం
ఇక్కడే నా మదిని సమాది చేసింది
ఇక్కడే నా ఆశలను ఆజ్యంతో తగులబెట్టింది
శిదిలమైన కట్టడాల కింద చరిత్ర సమాదైవుంటుంది
శిదిలమైన సమాదుల కింద జ్ఞాపకాలు నిక్షిప్తమైవుంటాయి
వెత్తుక్కోండి ఆనవాలు లబిస్తాయెమో
నేనో హంతకుడిని
ఆనవాలన్ని అగ్నికి ఆహుతిచేసాను
ఆకరికి ఆ అగ్నినిసైతం అంతరంగంలో
దాచేసుకున్న అవ్యక్తుడను
మహర్షి