ఎన్నోరొజులుగా వెతుకుతూనే వున్నాను
అక్షరాలకోసం
పిచ్చివాడు పగటిలొ చుక్కల్ని వెతికినట్లు
బిచ్చగాడు విసిరేసిన విస్తరిలొ మెతుకులు వెతికినట్లు
పంటవేసిన రైతు ఆకాశంలో మేఘాలు వెతికినట్లు
తలనెరిసిన శాస్త్రవేత్తలు అంతులేని అంతరిక్షంలొ జీవం వెతికినట్లు
మందలో దూరమైన దూడ తల్లిని వెతికినట్లు
తిరణాల్లొ తప్పిపోయిన బిడ్డని కన్నవాళ్ళు వెతికినట్లు
యవ్వనంలొ ప్రేమికుడు నచ్చిన నిచ్చెలి జాడ వెతికినట్లు
వార్దక్యంలొ దంపతులు మళ్ళీ వారి మద్య ప్రేమని వెతికినట్లు
మరణిస్తున్న వ్యక్తి తనవాళ్ళని తన చుట్టు వెతికినట్లు
అవకాశం లేని చోట ఆశతో
ఆశలేని చోట అవకాశానికై నిరీక్షించి
అక్షరాల లక్షణాలు కనిపించేంతవరకు
అవాంతరాలెన్నైనా లక్ష్యపెట్టక వెతుకుతూనే ఉంటాను
మహర్షి
2 comments:
చాలా బాగుందండీ!
వెతకాలి, వెతకనిదే ఏదీ దొరకదు (వర్షం సినిమాలో ప్రకాష్ రాజ్ స్టైల్ లో చదవండి) :)
thanku రసజ్ఞ gaaru
Post a Comment