Tuesday, December 25, 2012

సౌందర్యం

పాషాణపర్వతాల పల్లసంధుల్లో 
భారిగా పెరిగిన పచ్చిక
ఆకాశంలో కనిపించే నక్షత్రాలంత 
చిన్న పిచ్చుక 
ఇవన్ని చూస్తున్న నా మదిలో 
తెలియని ఎదో కొత్త క్రచ్చుక 

తలతోక లేని ఎర్రమట్టి దారి 
ఇరుపక్కలా మెరుస్తున్న పచ్చటి జరీ 

మేఘాలు లేని ఆకాశం 
నీలీ నీలి 
హుసూరుమని విసురుతున్న 
చల్లటి గాలి 

అడుగుకు వంతపాడుతూ 
దొర్లే గులక రాళ్ళు 
ఇనుపచెట్ల మీద అల్లిన పక్షి గూళ్ళు 

పాషాణ హృదయమైన పరవశించక మానదు 
ఇంత సౌందర్యం పలకరిస్తే.!
మహర్షి 

Tuesday, December 11, 2012

జ్ఞాపకాలు


ఈ గది నిండా నీ జ్ఞాపకాలే
నువ్వు విసిరేసినవి కొన్ని
నేను గెలుచుకున్నవి కొన్ని
కాలం కాగితాల్లొ రాసుకున్నవి కొన్ని
కాయం గాయాల్లొ దాచుకున్నవి కొన్ని
నవ్విస్తూ నరకం చూపించేవి కొన్ని
కన్నీటి వర్షంలో స్వర్గం తలపించేవి కొన్ని 
కలగా కవ్వించేవి కొన్ని
నిజంలా దహించేవి కొన్ని 
విరిగిన హృదయాన్ని అతికించేవి కొన్ని
అతికిన హృదయాన్ని ఉరితీసేవి కొన్ని
నీ జ్ఞాపకాలు గాజుపలకలు 
నీ ప్రతిబింబాలు చూపగలవు 
నా ప్రాణాలూ తీయగలవు 
మహర్షి 

Friday, December 7, 2012

కవి మరణం


నాలొ కవి మరణించాడు
నిన్నటివరకు కాగితాలలో వెలిగిన సూర్యుడు 
చీకటిలో కలిసిపోయాడు
అక్షరాల నుండి వెలయ్యాడు
పాదపద్మవ్యూహానికి బలయ్యడు
తనురాసిన కవితలే చితిగా కాలిపోయాడు 

చిత్తుకాగితాలేరుకునే చిన్న కుర్రాడి చేతిలో నలిగిపోతాననో 
పాతకాగితాల వాడి గొంతుక మరణశాసనంలా వినల్సివస్తుందనో 
కుంపటి చితిలో చితుకులుగా పడేస్తారనో 

పలువిధాల భయంతో కావొచ్చు 
భాదతో కావొచ్చు 
కారణాలు ఏవైనా కావొచ్చు 
అంతా జరిగిపోయింది 
ఆకరి కవితగా తననితాను 
అక్షరాలకు ఆహుతి చేసుకున్నాడు  
మహర్షి