ఈ గది నిండా నీ జ్ఞాపకాలే
నువ్వు విసిరేసినవి కొన్ని
నేను గెలుచుకున్నవి కొన్ని
కాలం కాగితాల్లొ రాసుకున్నవి కొన్ని
కాయం గాయాల్లొ దాచుకున్నవి కొన్ని
నవ్విస్తూ నరకం చూపించేవి కొన్ని
కన్నీటి వర్షంలో స్వర్గం తలపించేవి కొన్ని
కలగా కవ్వించేవి కొన్ని
నిజంలా దహించేవి కొన్ని
విరిగిన హృదయాన్ని అతికించేవి కొన్ని
అతికిన హృదయాన్ని ఉరితీసేవి కొన్ని
నీ జ్ఞాపకాలు గాజుపలకలు
నీ ప్రతిబింబాలు చూపగలవు
నా ప్రాణాలూ తీయగలవు
మహర్షి
2 comments:
బాగుంది మహర్షి గారు.
@ స్వామి ( కేశవ )దన్యవాదాలు
Post a Comment