మందుపాతరల మబ్బుల మద్యల నక్కి చూస్తున్న వెన్నెల
కెరటాల కవాతులతొ యుద్దానికి దూకుతున్న ధరణి
శతకోటి చుక్కల సైన్యంతొ చంద్రుడు
గ్రహాల గుంపులతొ సాటిలైట్స్ సమూహంతొ
సమరానికి సిద్దమైన సూర్యుడు
మేఘాల ఘీంకారాలు యుధ్దభేరిని మోగించాయి
అంతలొ...
అనుకోకుండా అపరిచితుడిలాంటి మానవుడు
ఆక్సిజన్ ఆవహించుకుని
కార్బండైఆక్సైడ్ కలగలిసిన
కాలుష్యపు కఠినస్త్రాలతొ
సమస్తాన్ని ఆక్రమిస్తున్నడు.. అంతం చేస్తున్నాడు...!
మహర్షి
4 comments:
మీ కవిత శక్తివ౦త౦గా వు౦ది.
bagundi...
thanks (k)3 and sahiti gaaru
మీ సైట్ ఎలా డిజైన్ చేసారో చెప్తారా?
Post a Comment