Thursday, January 27, 2011

జై కొట్టు


ముచ్చటగా ముప్పైఒక్క రాష్ట్రాలు
అందరికి ప్రాంతీయ భేదాలు
ఒకవేయి ఆరువందల పద్దెనిమిది భాషలు
అందరివీ భిన్నమైన భావాలు
ఆరువేల నాలుగువందల కులాలు
ఒకరితో ఒకరికి కుమ్ములాటలు
ఆరు మతాలు 
అరవై గొడవలకు కారణాలు
ఇరవై తొమ్మిది పండుగలు
ఇందులో ఎఒక్కటి జరగవు లేకుండా రక్షక దళాలు
ఇవన్ని కలిసిన ఒక్క దేశం 
దయచేసి అందరు కలిసి ఉండాలి అన్నది నా సందేశం



రాష్ట్రాల కాలహం కట్టిపెట్టు 
ప్రాంతీయ భేదాలు పక్కన పెట్టు 
నీలో మానవత్వం బయటికి వచ్చేట్టూ


భాష దోషాలు వదిలిపెట్టు
మౌనంతో మాటకట్టు 
అందరికి అర్ధం అయ్యేట్టూ 


కుమ్ములాటల కులాలు క్రిందంటూ
మతాలు అన్ని మూటకట్టు
మానవత్వం రాజ్యమెలేట్టూ


దేశం అంతా ఒక్కటంటూ 
మనిషికి మనిషి ఉంటే కలిసి కట్టూ
ప్రతీ రోజు పండుగన్నట్టూ
భారత దేశానికి జై కొట్టు
 మహర్షి 

2 comments:

Goutham Navayan said...

జై కొట్టు జై కొట్టు
అన్ని ప్రాంతాలకు జై కొట్టు.
యావద్భారతావానికి జై కొట్టు.
తెలంగాణా కి జై కొట్టు,
సీమాంధ్ర కి జై కొట్టు.
ఒక ప్రాంతం మీద మరొక ప్రాంతం పెత్తనాన్ని
ఒక యాస మీద మరో యాస చేసే అవహేలనలని
అగ్ర కులాలు బడుగు వర్గాల మీద చేసే దాష్టీకాన్ని
బలిసిన వాడు బలహీనులపై చేసే దౌర్జన్యాలని
పాతిపెట్టు.
రాష్ట్రాలు ఎన్నైనా మనమంతా భార్తీయులమే అన్న సత్యాన్ని నిలబెట్టు
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు రాజకీయ పోరంబోకుల ఆగదాలకే తప్ప
ఆంద్ర సామాన్యులకు వ్యతిరేకం కాదని చాటి చెప్పు
జై బోలో తెలంగాణా

Unknown said...

goutham gaaru ee oka topic meeda controversy elaa modalavthundi ante elaage.... nenu asalu dhenigurinchi vadhu ani cheppanu.. meeru yavathbarathaniki jai kottu antune mee telangaa vadaanni chupisthunnare.. yavath baratham ante a.p lo godavallo vunna rendu pranthalu kaadu.. jai kottandi bratha javanlaki,dukki dunne kisanki jai kottandi... ante nenu prantiya vaadame vodhu annanu meeru rendu pranthalane prasthavisthunnaru