వేయి ఏనుగుల బలం కలవాడినే
అయినా నీ అందం ముందర పసిపిల్లడినే
సాహసానికే పాఠాలు చెప్పగల దైర్యశాలినే
అయినా నీ కళ్ళలోకి చూడలేని పిరికివాడినే
కొండలను సైతం పిండి చేయగల బలశాలినే
అయినా నీ విరుల కురుల నుండి రాలిపడ్డ
వెంట్రుకని మాత్రము లేపలేని బలహీనుడనే
కాలానికి కళ్లెంవేయగల నేర్పరినే
అయినా నీ సమక్షంలొ కనురెప్పైనా వెయలేని నిస్సహయుడినే
అవును నీకు నేను బానిసనే
అయినా ఏమిచేయను నీవే నా బలానివి మరి..!
మహర్షి
3 comments:
Reallly a nice one.......
thanku satya........
ee kavitha chaala bagundi
Post a Comment