Saturday, December 24, 2011

నా మరణం


నేను మరణిస్తాను
నా తల మీద రెపరెపలడుతూ దీపం
కాల్ల ముందు పొగలు కమ్ముతు కుంపటి
కొందరు వెక్కి వెక్కి గుండె పగిలి ఏడుస్తారు 
మరికొందరు వెక్కిలిగా పడి పడి పగలబడి నవ్వేస్తారు
కొదరు జీవిచడం తెలీదంటారు  
మరి కొందరు జీవితం తెలిసినవాడంటారు
హీనుడనని కొందరు దీనుడని ఇంకొందరు ధీరుడని మరికొందరు 
గుఢచారులల గుసగుసలాడుతారు
ఇదంతా తీక్షనంగా వీక్షిస్తుంటాను  
తాటాకు పాడె మీద పడుకుని నేను
మొసేవారెవరు ముందు నడిచేవారెవ్వరు
లెక్కలేస్తారు కలిసికట్టుగా అందరు
నాపై చల్లిన చిల్లర ఎరుకుంటు
పిల్లాడొకడు పరిగెడుతూ ఉంటాడు
నా శవయాత్ర కాటికి చేరగా 
చితి పేర్చి దహనం చేసి 
దుఖ్ఖాన్ని దిగమింగేసి నటిస్తూ వెల్లిపోతారు 
కాలుతున్న చితి నుండి 
కట్నం వచ్చిన కాటికాపరి ఆనందాన్ని
ఏరుకున్న చిల్లర పొగేస్తున్న చిన్నోడి సంతోషాన్ని 
చూస్తు చావులో బ్రతుకని సంతోషిస్తూ 
నిప్పుల్లొ కాలిపోతాను నింగికి ఎగిరిపోతాను 
మహర్షి

Tuesday, December 13, 2011

ఆనందం


నిన్ను చూసిన క్షణం నా ఆనందం
అక్షరాలలో అభివర్ణించేది కాదు 
అందుకు బదులుగా 
నక్షత్రాలన్నీ నింగినుండి పోగుచేసి 
నీపై కురిపించాలనివుంది
నిండు చంద్రుడిని ముప్పవు ముక్క విరిచి
కర్పురంలా వెలిగించి నీకు దిష్టి తియ్యాలనివుంది
ఇంద్రధనుస్సుని తెచ్చి 
నీ పసిపాదాలు కందకుండా తివాచిలా పరచాలనివుంది 
మేఘాలన్నీ చెరిపేసి ఆకాశాన్ని మడతపెట్టి 
నీ పానుపులా మార్చాలనివుంది
ఒక్క మాటలో  
నా ఆనందాన్ని రెట్టింపు చేసి 
నీకు అందిచాలనివుంది నా అనుబంధమా 

మహర్షి

Sunday, December 11, 2011

మనిషి చచ్చిపొతె ముందు ఏడుస్తారు
తరువాత మట్టిలొ పూడుస్తారు
మనసు చచ్చిపొతె ముందు జ్ఞాపకాలను పూడుస్తారు
తరువాత మౌనంగా ఏడుస్తారు
 మహర్షి

ఆనందం

రెక్కలు విరిగిన పక్షికి అవి తిరిగొస్తే..?
ఒడ్డున పడ్డ చేపకి అల దరికొస్తే..?
ఈ క్షణం నేను ఆ పక్షిని,చేపని...!
 మహర్షి

Tuesday, December 6, 2011


నింగి సంద్రపు అడుగున 
దాగిన తెప్పల ఆల్చిప్పలు
ఆల్చిప్పల రెప్పలలొ 
దాగిన చిరు చినుకుల ముత్యాలకై 
వేచి వేచి నింగికేసి ఎదురుచూసే రైతును చూసి
కరుణించి వరుణించేనా ఆ నింగి.?
                                                                                     మహర్షి