Tuesday, December 13, 2011

ఆనందం


నిన్ను చూసిన క్షణం నా ఆనందం
అక్షరాలలో అభివర్ణించేది కాదు 
అందుకు బదులుగా 
నక్షత్రాలన్నీ నింగినుండి పోగుచేసి 
నీపై కురిపించాలనివుంది
నిండు చంద్రుడిని ముప్పవు ముక్క విరిచి
కర్పురంలా వెలిగించి నీకు దిష్టి తియ్యాలనివుంది
ఇంద్రధనుస్సుని తెచ్చి 
నీ పసిపాదాలు కందకుండా తివాచిలా పరచాలనివుంది 
మేఘాలన్నీ చెరిపేసి ఆకాశాన్ని మడతపెట్టి 
నీ పానుపులా మార్చాలనివుంది
ఒక్క మాటలో  
నా ఆనందాన్ని రెట్టింపు చేసి 
నీకు అందిచాలనివుంది నా అనుబంధమా 

మహర్షి

4 comments:

♛ ప్రిన్స్ ♛ said...

!! మహర్షి !! గారు బాగుంది చాలా బాగా వ్రాశారు

Anonymous said...

nice comparision mahesh :)

Shanthi said...

Very good poetry Mahesh ,Kudos..intaki evaru aa disthi teeyinchukune chandamama :) just kidding :)

Unknown said...

thanks@ తెలుగు పాటలు,@manasa gaaru
@shanti gaaru thanku