Saturday, December 24, 2011

నా మరణం


నేను మరణిస్తాను
నా తల మీద రెపరెపలడుతూ దీపం
కాల్ల ముందు పొగలు కమ్ముతు కుంపటి
కొందరు వెక్కి వెక్కి గుండె పగిలి ఏడుస్తారు 
మరికొందరు వెక్కిలిగా పడి పడి పగలబడి నవ్వేస్తారు
కొదరు జీవిచడం తెలీదంటారు  
మరి కొందరు జీవితం తెలిసినవాడంటారు
హీనుడనని కొందరు దీనుడని ఇంకొందరు ధీరుడని మరికొందరు 
గుఢచారులల గుసగుసలాడుతారు
ఇదంతా తీక్షనంగా వీక్షిస్తుంటాను  
తాటాకు పాడె మీద పడుకుని నేను
మొసేవారెవరు ముందు నడిచేవారెవ్వరు
లెక్కలేస్తారు కలిసికట్టుగా అందరు
నాపై చల్లిన చిల్లర ఎరుకుంటు
పిల్లాడొకడు పరిగెడుతూ ఉంటాడు
నా శవయాత్ర కాటికి చేరగా 
చితి పేర్చి దహనం చేసి 
దుఖ్ఖాన్ని దిగమింగేసి నటిస్తూ వెల్లిపోతారు 
కాలుతున్న చితి నుండి 
కట్నం వచ్చిన కాటికాపరి ఆనందాన్ని
ఏరుకున్న చిల్లర పొగేస్తున్న చిన్నోడి సంతోషాన్ని 
చూస్తు చావులో బ్రతుకని సంతోషిస్తూ 
నిప్పుల్లొ కాలిపోతాను నింగికి ఎగిరిపోతాను 
మహర్షి

1 comment:

Anonymous said...

wow....expressed so practically