Friday, January 4, 2013

బహుత్ హోగయ

శబాష్ శబాష్ శబాష్ 
దేశం కీర్తి ఎక్కడికో... పోయింది 
చాలుచాలు  ఇంకా చాలు 
అరిచి గోల పెట్టింది చాలింక 
ఫేస్ బుక్ లొ షేర్లు,లైక్ లు కొట్టి 
ఉద్దరించింది చాలింక 
చాలా సాదించేసాం ఇప్పటికే 

కావలసినంత ప్రచారం మీడియాకి 
దొరికేసింది
కావలసినంత నిందించె కారణాలు ప్రతిపక్షానికి   
దొరికేసింది 
కావలసినంత ఖండించి విచారించే అంశం అధికార పక్షానికి 
దొరికేసింది 
ఇక జనం 
మనం మాత్రం తక్కువ తిన్నామా 
గోల పెట్టాం,గగ్గోల పెట్టాం 
నినాదాలు ప్రాసలో
కోవోత్తులు వరుసలో 
నిమిషాల పాటు నిశబ్దాలు 
కిలోమీటర్ల పాటు ధర్నాలు 
అంతేనా.!
పత్రికల్లో తెగ చదివేసి 
వార్తాప్రసారాల్లో తెగ చూసేసి 
ఎక్కడ సమయం ఉన్నా 
వృదా చేయకుండా గుముగూడి మరీ 
చర్చించేసి 

విషయం ఇప్పటికే అర్దమై ఉంటుంది 
చీకట్లో బాణాలకు 
మనమంతా అర్జునులమే కదా 

ఇంకా చాలు 
భార్య చాటు భర్తలు 
భర్త చాటు భార్యలు 
కాలం కరిగిపోతుంది 
మీరు మీ సంసారాలు సాగించండి 
మనకసలే సామెతలకు కరువులేదు 
దేశం గొడ్డుపోయిందా అనుకునేలోపు
మరో వంద కోట్ల మూర్కుల్ని,వేదవల్ని 
కనిపారేయండి 

దేశాన్ని నడిపే యువత 
నడిపి నడిపి అలిసిపోయి వుంటారు 
పబ్బుల్లో కాస్త సేదతీరండి 
చెట్టపట్టాలేసుకుని చెడతిరగండి 
సొల్లు కబుర్లతో కాస్త దమ్ము తీసుకోండి 
కొత్త అన్యాయం జరిగేంతవరకు 
ఎక్కువ సమయం పట్టడులెండి 
మన దేశం సమస్యలకు అక్షయపాత్ర 
అందుకే దయచేసి కాస్త విశ్రమించండి 
నా పిచ్చి తల్లి నిర్భయ సైతం అలిసిపోయి 
శాశ్వత నిద్రలోకి జారుకుంది పాపం 

నా అమాయకత్వం కాకపొతే 
మీరు ఒక ఆకు ఎక్కువగానే చదివారు కదా.!
ఆత్మా గౌరవాన్ని ఎప్పుడో విడిచేసారు కదా.!
కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయారు కదా.! 
మరుసటి రోజన్ని  మర్చిపోయారు కదా.! 
నేను గ్రహించనేలేదు.

ఒక్క విషయం మాత్రం కచ్చితంగా తెలుసు 
పక్షపాతం లేని తత్త్వం మీది 
మన దేశంలో అమ్మాయని కాదు 
మన ఇంటి అమ్మాయి అయినా 
ఆకరికి మన భారతమాత అయినా 
మీ వైకరిలో మార్పేమీ ఉండదు కదూ.! 

మ(హి)నుషులరా మీకు మీరే సాటి 
మీ నీచత్వానికి,అసమర్ధతకు 
ఏజంతువు రాదు పోటి.!
మహర్షి 

Wednesday, January 2, 2013

ఎదురుచూపు


వేచాను నేను.. ఈ క్షణానికై
కేవలం క్షణాలు కాదు
ప్రతీ క్షణాన్ని మరో యుగంలా .!
నీకు తెలుసా.?
కాలం ఎంత కటినమైందో...!
క్షణం ఎంత నిర్ధక్షన్యమైందో ..!
సరే వదిలెయ్..
ఉపిరి లేని హృదయాన్ని
సూర్యుడు లేని ఉదయాన్ని
జాబిలీ లేని పున్నమిని
నాడుల్లోన సడిలేని సునామిని
చలనం లేని సముద్రాన్న్ని
గమ్యం లేని బాటసారిని
శవంలా జీవిస్తున్న మనసుని
మనిషిలా నటిస్తున్న శవాన్ని
ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా.?
ఒకేఒక్కసారి అన్ని చూడు
నా బాధ తెలుస్తుంది
లేదా నన్ను చూడు
ఆ ఆవేదన తెలుస్తుంది
ఆకరికి నిరీక్షన ఫలించింది
ఆనందం గొంతు వినిపించింది
పేరు పిలిచి పలకరించింది
ఒక క్షణం హృదయం శ్వాసించింది
ఉధయం వెలుగుపువ్వు పూసింధి
జాబిలి వెన్నెల ఒలకబోసింధి
నాడుల్లొ నెత్తురు ఉరకలేసింధి
కెరటాలతొ సంద్రం ఎగిసిపడింధి
అచ్చం నా మనసులా..
మరోసారి పుట్టిన మనిషిలా ..!
మహర్షి 

Tuesday, January 1, 2013

ఏది నూతనం.?

ఎందుకీ అంబారానంటే సంబరాలు 
ఎంసాదించామని సంతసిస్తూ ఈ సంబరాలు 
ఎంఉద్దరించామని ఊరేగుతూ ఈ ఉత్సవాలు 
నూతన సంవత్సరాన్ని స్వగతిస్తునా 
గతసంవత్సరం గడిచి,విడిచి పోయిందనా.?
అసలు ఏది నూతనం 
పంచాంగాల్లో అంకెలు తప్ప 

మింగమెతుకు లేని బ్రతుకులు
వెన్నుకంటిన డొక్కలు 
మేఘాలకు పాకిని మేడలు
నేలను నాకే పేదలు
నీతి తప్పిన సమాజం 
నిర్వచనం మారిన స్వరాజ్యం 
చలనం లేని జనత
బాధ్యత లేని యువత 
నిజం ఎడారిలో నీటి బిందువు 
అబద్దం అందరికి ఆత్మబంధువు
చట్టాలు న్యాయాలు నమిలూసే కిళ్లిలో కట్టామిట్టాలు 
రాజ్యాంగం మన రాజకీయుల చదరంగం 
మద్యపానమే మన ఆర్దిక వ్యవస్థ మూలాధారం 
అత్యాచారమే దేశరాజదాని ఆచారం 
చెదలు పట్టిన గతం మన చరిత్ర 
చెదపురుగులు మన(o) జనం 
ఇదే మారని మన నిత్యవర్తమానం  


మతి,గతి తప్పిన ప్రభుత్వాలు 
అన్యాయం,అక్రమాల ఆదిక్యత ప్రతీచోట 
జాతి తలదించుకునే ఎన్నో గాధలు 
హవ్వ.! సిగ్గు చేటు 
ఇవేనా మన గర్వకారణాలు 
అందుకేనా ఈ సంబరాలు.?
మహర్షి