Tuesday, January 1, 2013

ఏది నూతనం.?

ఎందుకీ అంబారానంటే సంబరాలు 
ఎంసాదించామని సంతసిస్తూ ఈ సంబరాలు 
ఎంఉద్దరించామని ఊరేగుతూ ఈ ఉత్సవాలు 
నూతన సంవత్సరాన్ని స్వగతిస్తునా 
గతసంవత్సరం గడిచి,విడిచి పోయిందనా.?
అసలు ఏది నూతనం 
పంచాంగాల్లో అంకెలు తప్ప 

మింగమెతుకు లేని బ్రతుకులు
వెన్నుకంటిన డొక్కలు 
మేఘాలకు పాకిని మేడలు
నేలను నాకే పేదలు
నీతి తప్పిన సమాజం 
నిర్వచనం మారిన స్వరాజ్యం 
చలనం లేని జనత
బాధ్యత లేని యువత 
నిజం ఎడారిలో నీటి బిందువు 
అబద్దం అందరికి ఆత్మబంధువు
చట్టాలు న్యాయాలు నమిలూసే కిళ్లిలో కట్టామిట్టాలు 
రాజ్యాంగం మన రాజకీయుల చదరంగం 
మద్యపానమే మన ఆర్దిక వ్యవస్థ మూలాధారం 
అత్యాచారమే దేశరాజదాని ఆచారం 
చెదలు పట్టిన గతం మన చరిత్ర 
చెదపురుగులు మన(o) జనం 
ఇదే మారని మన నిత్యవర్తమానం  


మతి,గతి తప్పిన ప్రభుత్వాలు 
అన్యాయం,అక్రమాల ఆదిక్యత ప్రతీచోట 
జాతి తలదించుకునే ఎన్నో గాధలు 
హవ్వ.! సిగ్గు చేటు 
ఇవేనా మన గర్వకారణాలు 
అందుకేనా ఈ సంబరాలు.?
మహర్షి 

2 comments:

Raveendra said...

In every line the pain is visible
Yes, why celebrations for another dirty year, unless we change

Unknown said...

@TM Raveendra gaaru.. :)