Wednesday, February 27, 2013

శ్వాసించే శవం

నాసిక నడిదారుల్లో అందర్ బాహర్ 
ఆడుతుంది ఉపిరి
స్మశానం నుండి వినిపించక వినిపిస్తున్న  డప్పుల 
సడిచేస్తుంది గుండె 
తెగిపడ్డ బల్లితోక ఊగిసలాడినట్టు 
నటిస్తోంది నాడి 
కాలుతు కదులుతూ,కదులుతూ కాలుతున్న ఉష్ణద్రవంలా 
పారుతుంది నెత్తురు
చరిత్ర చాటే సిదిలాలకంటే 
దృడంగా వున్న యెముకలు
కాలం కంటే చురుగ్గా 
కదులుతున్న కండరాళ్ళు 
బ్రతికున్నావా..? అన్న ప్రశ్నకు
సమాధానంగా ఈ సాక్ష్యం చాలు 
కాని 
జీవిస్తున్నవా ...? అని అడిగితె..!
నువ్వు లేని నేను శ్వాసించే శవంతో సమానం 
అన్నది నా సమాధానం... 
మహర్షి 

2 comments:

Padmarpita said...

nice poetry after a long time.

రసజ్ఞ said...

వ్యక్తీకరణ చాలా బాగుందండీ