Thursday, June 13, 2013

అక్"శరము"

కావు నా అక్షరాలు కాగితాల పూలు 
కావు నా అక్షరాలు ప్రియురాలికి మురిపాలు 
కానే కావవి పసిపిల్లల లుల్లాయిలు 
మరి కావవి 
అభినందన హారాలు 
ప్రశంసల పదమాలలు 
గిలిగింతల కవ్వింతలు 
సిరిమంతుల ధనవంతుల పొడగింతలు 

కావు నా అక్షరాలు కాగితాల పూలు 

చీలు నాల్కెలు చాచు
నిజము క్రక్కె త్రాచులు 
బొంక నేర్చిన మనిషి 
డొంక కదిలించును 

చిమ్మ చీకటి చాటు 
మెరిసె మినుగురులు 
చీకటంతటిని చెరిపి 
వెలుగు విరజిమ్మును 

నేటి రావణుల చీల్చు 
నాటి రామబాణాలు 
వాటి ధాటికి నిలువ ఎవరుండును 

నా పదము 

చండ సూర్యుని రధము 
వీరభద్రుని పదము 
కృష్ణసఖుని ధన్వము
ప్రళయ మేఘ ధ్వనము 

నా అక్షరాలు

కొదమ సింహపు జూలు 
మదపుటేనుగు కేలు
కామధేనువు పాలు 
ఎడారి చలమల నీళ్ళు 

కావు నా అక్షరాలు కాగితాల పూలు... 
మహర్షి 

2 comments:

Unknown said...

very very nice

Unknown said...

@skvramesh- కృతజ్ఞతలు