Saturday, September 7, 2013

ఒంటరి తీరం

అమావాస్య చీకటిలొ తీరాన ఒంటరిగా కూర్చున్నాను 
సముద్రంలో అలల్లా 
నా యదలో నీ ఆలోచనలు 
ఎగిసి పడుతున్న అలలు ఎన్నో 
                ఆలిచిప్పలను మోసుకొస్తే 
నీ ఆలోచనలు ఎన్నో 
          అనుభూతులను మోసుకొచ్చాయి 
వడ్డుకోచ్సిన ఆలిచిప్పలలో 
విరిగినవి కొన్ని,
మెరిసినవి కొన్ని,
వింతైనవి కొన్ని
గుర్తుకొచ్చిన జ్ఞాపకాలలో 
ఏడిపించేవి కొన్ని,
నవ్వించేవి కొన్ని,
ఆ రెంటికి నడుమన నన్ను ఉరితీసి కవ్వించేవి కొన్ని 
తిరిగి వెళ్ళిపోతున్న అలను పట్టుకోలేక తీరం 
అలల నురుగు దాచుకునట్లు 
నన్ను వదిలి వెళ్ళిపోయిన నిన్ను అందుకోలేక నేను 
నీ జ్ఞాపకాలు దాచుకున్నాను...
మహర్షి 

2 comments:

Meraj Fathima said...

కవిత చాలా బాగుంది మంచి భావుకత, ఇక పోతే తిమిరమ్లో వెలుగు రేకలయ్యాయి మీ అక్షరాలు. వెనుక ఉన్న నల్లటి రంగు చదవటానికి కొంచం ఇబ్బ్బంది పెడుతుంది. ఇలా రాస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు

Unknown said...

@meraj fathima- కృతజ్ఞతలు

కలిగిన అసౌకర్యానికి క్షమించాలి.. రాతిరి రంగు మీద అక్షర నక్షత్రాలని, అలా రాయడం జరిగింది..

fact- white and black are best combination,so
p.s- can u suggest any colour combination.? that suits my blog..