Sunday, October 6, 2013

తప్పంతా నాదె

చాన్నాళ్ళయింది నిన్ను చూసి 
ఇన్నాళ్ళలో చాలా దూరమైపోయావు 
దేగ్గరవ్వాలన్న నా ప్రయత్నం 
నలుగురిలో నవ్వులపాలయ్యేంత దూరం 

ఆనాటి రోజుల్ని తలుచుకుంటే
ఆనందంలాంటి ఆవేదన కలుగుతుంది 
గతం తాలూకు జ్ఞాపకాలన్నీ గాజుపలకలే 
ప్రస్తుత ప్రతీక్షణంలో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి 

నన్ను ఆట పట్టిస్తున్నావని అనుకున్నాను 
అలక్ష్యం చేస్తున్నావని గ్రహించలేదు 
నాతొ ఆడుకున్నావని అనుకున్నాను  
నన్నే ఆడుకున్నవని గ్రహించలేదు 

నువ్వు గెలుస్తున్నావని ఆనందించాను 
నన్ను ఓడిస్తున్నావని గ్రహించలేదు 
నీ బంధానికి బానిస చేస్తున్నావని అనుకున్నాను 
బలి చేస్తున్నావని గ్రహించలేదు 

కలవై కవ్విస్తునావని అనుకున్నాను 
కళ్ళలో కన్నీరని గ్రహించలేదు 
మనసు లోతుల్ని గ్రహిస్తున్నావనుకున్నాను 
గాయపరుస్తున్నావని గ్రహించలేదు 

నాలో జీవం పోస్తున్నావని అనుకున్నాను 
నన్ను జీవశ్చవాన్ని చేస్తున్నావని గ్రహించలేదు 

సూక్ష్మంగా గ్రహిస్తే తప్పంతా నాదే 
నీ పేరు ఆనందమనీ తెలుసు...!
నువ్వు అందమైన ముల్లనీ తెలుసు..!
గుండెలోతుల్లో గుచ్చుకుంటావనీ తెలుసు...!

తెలిసి తెలిసి చొరవ చూపాను....
గుండె పగిలి కుమిలిపోయాను...

ఆనందం జ్ఞాపకమైంది
ఆవేదన జీవితమైంది 
నేను జీవశ్చవమయ్యాను..!
మహర్షి