Saturday, October 26, 2013

మలుపు

అష్టదిక్కులు కలిస్తే ప్రపంచం
మేము అష్ట సఖులం కలిస్తే మా ప్రపంచం
హద్దులు లేని ఆకాశం మా ఆనందం 
నడి సంద్రంలో అలలు,మా కన్నుల్లో కన్నీళ్లు ఉండవనుకున్నాం 
పాతికేళ్ళ మా ప్రపంచాన్ని అనుకోని అల 
అతలాకుతలం చేసి అందరిని ఆవేదనలో ముంచేసింది 

మా స్నేహితుని పెళ్లని
వధువు రతణాల వల్లని
ఆనందం అక్షింతల్లా జల్లాలని
ఆనాడే మరలి రావాలని
వెళ్ళారు

రాతిరి రారాజు నిద్రలేచాడు
రహదారిలో చీకటి నిద్దరోయింది
రాతిరి రహదారి మలుపులు
ప్రమాదాల తలుపులు
దురదృష్టం తలుపు తీసింది
ప్రమాదం పలకరించింది

రాత్రంతా రంగుల కల 
చీకటి విసిరినా చిక్కుల వల 
చెదిరిన మనసుతో, కన్నీరు కన్నుల

ఘటనలో గతి తప్పి కొందరు
సంఘటన సంగతి తెలియక కొందరు
మిడి జ్ఞానంతో మిడుకుతూ కొందరు

అయోమయాన్ని ఆవేదనతో గుణిస్తే
అదోగతిల మిగిలింది మా స్థితి

కాలానికి తాళం వేయలేము కాని
మా మనసు ఖజానా గొల్లం తీసి
ధైర్యాన్ని కర్చు చేయాలనీ గ్రహించాం

కర్చు చేసిన దైర్యం
మా కాళ్ళను కదిలించింది
నడిపించింది,పరిగెత్తించింది
ఆశని ఆయుధంగా చేసుకుని
కాలంతో కయ్యానికి సిద్దపడ్డాం

శత్రువు బలం అసమానమని తెలుసు
అయినా వదలోద్దంది అందరి మనసు

అదృష్టమో,దురదృష్టమో
గెలుపో, ఓటమో

కాలం ఓడించలేకపోయింది కాని
బలహీన పరచగలిగింది
మా ఆనందం కాలు విరిచి
మమల్ని వికలాంగులను చేసింది

చిరునవ్వు మా చెంతనిక చేరదనుకున్నాం
విషాదం మమ్మల్ని విడువధనుకున్నాం

మదిరెబాబా మాకు మనోదైర్యం ప్రసాదించాడు 
ప్రమాదాన్ని పరిహసించాం 
ఆనందం మా జీవితాల్లోకి వెనుతిరిగి వచ్చేసింది 
కాకపోతే మునుపటిలా పరిగెత్తలేక 
నెమ్మదిగా నడుస్తూ............................................................................
మహర్షి 

2 comments:

Padmarpita said...

beautifully narrated.

Karthik said...

Very very beautiful..:-)