Tuesday, December 1, 2015

వాడు లేడు....

గదిలొ ఎవరులేరు 
నాలుగు గోడల నాలుగు దిక్కుల 
నాలుక చీలిన నాగుల నిదమై 
నల్లని నిశ్శబ్దం 
ఎవరులేరు గదిలొ....

గదిలొ ఎవరులేరు
సెగలు సెగలు పొగలు పొగలు
తెరలు తెరలు మెరవని మినుగురులై 
సురభీకరించు భీకర మృతసౌరభము
ఎవరులేరు గదిలొ...  

గదిలొ ఎవరులేరు
యేటవాలుబల్ల మీద
నిట్టనిలువ నిలబడిన 
అనేక అశ్రువులతొ 
అనేక అలేఖ పుస్తకాలు
ఎవరులేరు గదిలొ....  

గదిలొ ఎవరులేరు
అతుకుల చితుకుల చీలికలు
రెపరెపలాడిన రంగుల రెక్కలు 
మనసుని పోలిన కాగితాలు
ఎవరులేరు గదిలొ...  
  
గదిలొ ఎవరులేరు 
తీరని ఆశల ఆరిన దీపం
విరిగిన హృదయం ఎవ్వరి శాపం 
కాల్చె కాలం కటంకటకూపం
ఎవరులేరు గదిలొ....  

గదిలొ ఎవరులేరు
ఉండాల్సిన ఒక్కడూ 
పగిలిన గుండె బరువై 
రెండు కండ్లు చెరువై 
ఆశకు ఆయువు కరువై 
బొందిలొ బందీని విదులచేసి 
గదిని గతంలొ వదిలేసి 
జాబిలి పక్కన తారగ మారగ
మరొక్కసారి మరొక్క ప్రయత్నమని 
మరుజన్మకు మరణించి వెల్లిపోయాడు
ఎవరులేరు గదిలొ...
మహర్షి

2 comments:

GKK said...

సురభీకరించు భీకర మృతసౌరభము- ? ?
unable to understand. what you wanted to say.

Unknown said...

భయంకరమైన చచ్చిన వాసన(వ్యంగ్యంగా సువాసన) వస్తుంది అని