Thursday, April 14, 2016

దర్శనమీయవు!!!

ఆకాశంలో జాబిలి 
ఒక్కసారి నిన్ను చూడాలి 
దూరంగానో,దెగ్గరగానో!
కనీసం క్షణమో,అరక్షణమో !
నిన్ను చూడని నేను 
శిలనైపోతున్నాను,శిధిలమైపోతున్నాను  
యద బరువై ముక్కలైపోతున్నాను
రెక్కలు తెగిన పక్షినై 
నేలకు రాలిపోతున్నాను
నానుండి నేనే చీలిపోతున్నాను
కాష్టంలా కాలిపోతున్నాను 
నిజానికి అసలేమైపోతున్నానో తెలియదు 

వెలుతురు చూడని పగలు 
తీరం చూడని అలలు 
చుక్కలు చూడని చీకటి 
చిగురు చూడని వసంతం 
నిన్ను చూడని నేను!

పూయడం మర్చిపోయిన పూలచెట్టు
నాట్యం మరిచిన నెమలి 
రంగు వెలిసిన సీతాకోకచిలుక 
చిరునామాలేని ఉత్తరం 
దారం తెగిన గాలిపటం
నిన్ను చూడని నేను!
మహర్షి 

1 comment:

Zilebi said...



ఆకాశంలో జాబిలి
నా కోరిక తీరగాను నాదరి రమ్మా
రాగము లేకను జీవన
యోగము చూడక జిలేబి యోచన జేసెన్