Saturday, June 27, 2009



అక్షరము అను శరము
రక్షణలేక శిక్షణ లేని పాలసుల శాస్త్రముగా మారినది

అవివేకులు ఏకమై తలమునంత
నిష్టనికృష్ట అనిష్టము అవర్తరిస్తున్నారు

రాముడి పాలనఏమో......?
రాక్షస పాలన కళ్ళకు కనువిందైనది......

ప్రభువు పరమాత్మ ఐనా ......
దూతలు ధయ్యములాయెను.....!

రక్షణభట్టుల రాజ్యన నిత్యం రాక్షస భటులైతే.........
నరలోకము కాదిది నరకలోకమా అను సందేహము కలిగెను.......!
 మహర్షి 

కవిత by కపిరాజు

కంటికి కాంతి
చెవులకు ధ్వని
నోటికి మాట
శ్వాసకి గాలి
హృదయానికి స్పందన
చేతికి పని కాళ్ళకు నడక
స్త్రీకి ఓక అండ
పురుషుడికో తోడు కావాలంటాడు జండాపై కపిరాజు

Monday, June 15, 2009

ఏమౌతుంది ఈ ధరిథ్రి




ఎందుకొరకు ఈ దరిద్రి ధరిద్రముగా మారుతున్నది
ప్రజాస్వామ్య ప్రభుత్వమప్పుడు ప్రజాహింస రాజ్యమిప్పుడు
పెద్దవాడు పేదకాడు, లేనివాడు పెద్దకాడు
వావివరుసలు తెలియకున్నవి ,కన్నుమిన్ను కానకున్నది
కరుణలేని శవాలన్నీ కాటినుండి వచుచున్నవి
మానవత్వము మచుకైనా కానరాదు మనిషిలోన
నాకు తెలుసు నాకు తెలుసు ఎక్కడున్నదో నాకుతెలుసు
కాటిలోనా కాలుతున్నది సమాజంలో సమాదైనది
శాంతియన్న కాంతి ఒక్కటి కారుచీకటిలోన కలసినది
వేలుతురన్నది లేకపోయినది లోకమంతా చీకటైనది
ఏమౌతుంది ఈదరిద్రి ఇంతకంటే ఇంతకంటే .......!

 మహర్షి 

గమ్యం


అక్షర గమ్యం పదం వరకు
పదం గమ్యం కాగితం వరకు

పలుకు గమ్యం పాట వరకు
పల్లవి గమ్యం చరణం వరకు

శబ్దం గమ్యం నిశ్శబ్ధం వరకు
నిశ్శబ్ధం గమ్యం శబ్దం వరకు

నది గమ్యం సముద్రం వరకు
సముద్ర గమ్యం తీరం వరకు

చీకటి గమ్యం వెలుగు వరకు
సూర్యుడి గమ్యం పడమర వరకు

ఆశ గమ్యం అంబరం వరకు
అత్యాశ గమ్యం అనర్ధం వరకు (అంతం వరకు )

వయసు గమ్యం వలపు వరకు
ప్రేమ గమ్యం పెళ్లి వరకు

గురి గమ్యం లక్ష్యం వరకు
ఓటమి గమ్యం గెలుపు వరకు

బాధ గమ్యం ఏడ్పు వరకు
ఒంటరి గమ్యం తోడు వరకు

మనిషి గమ్యం మరణం వరకు
కీర్తి గమ్యం అనంతం వరకు

 మహర్షి 

కవిత

మదిలోని కళలు
కధనముగా మర్చి
కధనమును కారమునకు చేర్చి
కాలమునకు జార్చి సిరముగా మర్చి
కాగితమున కూర్చునది కవిత్వము
 మహర్షి