Monday, June 15, 2009

గమ్యం


అక్షర గమ్యం పదం వరకు
పదం గమ్యం కాగితం వరకు

పలుకు గమ్యం పాట వరకు
పల్లవి గమ్యం చరణం వరకు

శబ్దం గమ్యం నిశ్శబ్ధం వరకు
నిశ్శబ్ధం గమ్యం శబ్దం వరకు

నది గమ్యం సముద్రం వరకు
సముద్ర గమ్యం తీరం వరకు

చీకటి గమ్యం వెలుగు వరకు
సూర్యుడి గమ్యం పడమర వరకు

ఆశ గమ్యం అంబరం వరకు
అత్యాశ గమ్యం అనర్ధం వరకు (అంతం వరకు )

వయసు గమ్యం వలపు వరకు
ప్రేమ గమ్యం పెళ్లి వరకు

గురి గమ్యం లక్ష్యం వరకు
ఓటమి గమ్యం గెలుపు వరకు

బాధ గమ్యం ఏడ్పు వరకు
ఒంటరి గమ్యం తోడు వరకు

మనిషి గమ్యం మరణం వరకు
కీర్తి గమ్యం అనంతం వరకు

 మహర్షి 

5 comments:

Aditya Madhav Nayani said...

"శబ్దం గమ్యం నిశ్శబ్ధం వరకు
నిశ్శబ్ధం గమ్యం శబ్దం వరకు

గురి గమ్యం లక్ష్యం వరకు
ఓటమి గమ్యం గెలుపు వరకు"

ఆ రెండు లైనులు అద్భుతంగా ఉన్నై..
చాలా బాగుంది బొమ్మ కూడా

kavi said...

hello Mr.Mahesh, i red few works of you,they are fine especially this one"Gamyam"good concept you wrote,really good one..keep going, bye.

విశ్వ ప్రేమికుడు said...

నా గమ్యం నీ వరకు

చాలా బాగుంది మిత్రమా. :)

Unknown said...

thanku

RAMESH said...

బాధ గమ్యం ఏడ్పు వరకు
ఒంటరి గమ్యం తోడు వరకు

మనిషి గమ్యం మరణం వరకు

super ga vundi