నాతో సంబాషించడానికి సంకోచిస్తే
నేను నీకు ఏమికాను
నా ఉనికి నిన్ను ఇబ్బందికి గురిచేస్తే
నేను నీకు ఏమికాను
నాకు ప్రతిసారి కృతజ్ఞత చెబితే
నేను నీకు ఏమికాను
నువ్వు చేసిన తప్పుకు క్షమించమని అడిగితే
నేను నీకు ఏమికాను
నన్ను సాయం కోరితే
నేను నీకు ఏమికాను
నేను చెప్పిందిమాత్రమే నువ్వు చేసిననాడు
నేను నీకు ఏమికాను
నా మదిలో మాట నువ్వు తెలుసుకోలేనినాడు
నేను నీకు ఏమికాను
నీ పలుకులు వినకుండా నేను పడుకున్నాను అనుకుంటే
నేను నీకు ఏమికాను
నీ గాయానికి నా నయనం తడిసిందంటే నమ్మడం లేదా
ఐతే నేను నీకు ఏమికాను
మన మొదటి కలయిక నాకు గుర్తులేధనుకుంటే
నేను నీకు ఏమికాను
నీ ఆనందానికి నన్ను నేను సమర్పించుకోలేకపోతే
నేను నీకు నిజంగానే ఏమికాను ....
మహర్షి