Wednesday, September 2, 2009

నువ్వే ఎదురైతే ప్రియ....!

నీ ముగ్ధ మనోహర రూపం


తలపులో కదలగానే



ఏదో అవ్యక్త మధురగానం


మనసుని చుట్టుకుని


కలవరం కలిగిస్తుంది


నీ ఉహా మదిలో మెదలగానే



ఏదో అద్బుత పరిమళం



బ్రతుకంతా కమ్ముకొని



పరవశం కలిగిస్తుంది



నీ కనుచూపుల జ్ఞాపకం సోకగానే



ఏదో మనోహర ప్రశాంత సుందర దృశ్యం



కళ్ళచుట్టూ ఆవరించుకొని



కాంతి పుంజ ప్రసారాలు చేస్తుంది



నీ పలుకుల మాధుర్యం ఉహించుకోగానే



చల్లని సురభిళ సమీర వీచిక



తనువును మనసునూ సేదతీరుస్తూ పులకరింపచేస్తుంది



ఉహాలు తలపులే ఇంత మంత్ర మోహనంగా వుంటే



ఇక నీవే కనికరించి ఎదురైతే ప్రియ



నా బడుగు హృదయం భరించగాలద....
 మహర్షి 

3 comments:

Sahiti Ravali said...

edo avyaktha madhuraganam......
adbhutanga rasaru....

Aditya Madhav Nayani said...

చాలా బాగా రాసారు... :)

Unknown said...

thanku sahiti gaaru