Saturday, September 5, 2009

నేను నీకు ఏమికాను కాని నువ్వు నా ప్రాణం


నాతో సంబాషించడానికి సంకోచిస్తే
నేను నీకు ఏమికాను

నా ఉనికి నిన్ను ఇబ్బందికి గురిచేస్తే
నేను నీకు ఏమికాను

నాకు ప్రతిసారి కృతజ్ఞత చెబితే
నేను నీకు ఏమికాను

నువ్వు చేసిన తప్పుకు క్షమించమని అడిగితే
నేను నీకు ఏమికాను

నన్ను సాయం కోరితే
నేను నీకు ఏమికాను

నేను చెప్పిందిమాత్రమే నువ్వు చేసిననాడు
నేను నీకు ఏమికాను

నా మదిలో మాట నువ్వు తెలుసుకోలేనినాడు
నేను నీకు ఏమికాను

నీ పలుకులు వినకుండా నేను పడుకున్నాను అనుకుంటే
నేను నీకు ఏమికాను

నీ గాయానికి నా నయనం తడిసిందంటే నమ్మడం లేదా
ఐతే నేను నీకు ఏమికాను

మన మొదటి కలయిక నాకు గుర్తులేధనుకుంటే
నేను నీకు ఏమికాను

నీ ఆనందానికి నన్ను నేను సమర్పించుకోలేకపోతే
నేను నీకు నిజంగానే ఏమికాను ....
 మహర్షి 

7 comments:

Sahiti Ravali said...

chala baga rasaru........

Aditya Madhav Nayani said...

చాల బాగుంది.. :)
మీ బ్లాగుని అందరికీ తెలిసేలా కూడలి, జల్లెడ లాంతి వాటిలొ పెడితే బాగుంటుంది, అప్పుడు ఎక్కువ మంది మీ రచనలు చదివే అవకాసం ఉంటుంది....

మీ బ్లాగుని కూడలిలో చేర్చాలనుకుంటే,
support @ koodali.org కి మీ బ్లాగు URL ని మెయిల్ చేయండి. మీరు మెయిల్ పంపేముందు ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోండి:

మీరు మెయిల్ పంపిన తర్వాత మీ బ్లాగు కూడలిలో కనబడడానికి దాదాపు ఒక రోజు నుండి రెండు రోజుల వరకు పట్టవచ్చు.
తెలుగులో వ్రాసే బ్లాగులని మాత్రమే కూడలిలో చేరుస్తాము.

ధన్యవాదములు
Aditya Madhav

Aditya Madhav Nayani said...

word verification కొంచం కష్తంగా ఉంది, u can change the settings in blogger if u want.. :)

thank u
Aditya Madhav

Unknown said...

thanks for ur suggestions and comments.... settings lo emi change cheyyali

సుజ్జి said...

this one is really nice. :)

kavi said...

నన్ను సాయం కోరితే
నేను నీకు ఏమికాను i thought this is typed wrongly Mr.Mahesh.this indicates totally selfishness of speaker,so think once again over this,pls dont mind that i am saying so.

Unknown said...

adi alaa kaadu..... nannu saayam korithe nenu neeku emi kaanu... ante request cheyyaku demand cheyyamani....