Friday, April 13, 2012

క "వి" క


కదిలించే వాడు కవి క
రిగించే వాడు కవి క 
లని చూపించే వాడు కవి క 
లతని మరిపించే వాడు కవి క 
ఠినంగా నిందించే వాడు కవి క 
న్నుల బాషను చదివే వాడు కవి క 
న్నీటితొ కాగడా వెలిగించే వాడు కవి క 
న్నెల వన్నెలు వర్ణించే వాడు కావి క 
రంకము చాటు మది లోతుని గ్రహించే వాడు కవి కా 
వ్యంతొ బంధించే వాడు కవి కా    
లానికి తాళంవేసె వాడు కాలం వేసిన తాళం తీసే వాడు కవి కా 
గితం ప్రసవించిన పసి పదాలను పాలించి లాలించే వాడు కవి కా
లిపోయిన జీవితన్ని బూడిదైన కాగితన్ని కాచి తాగే వాడు కవి క 
లాన్ని కపోతిలా విడిచి మనసుని మార్చి మార్చి                                           దూషించి,ద్వెషించి,తిరస్కరించి,మోసగించి,అభినందించి,ప్రేమించి,ఆరాదించి,అనుమానించి,విసిగించి,రచించే వాడే కవి 
మహర్షి

Saturday, April 7, 2012

చెత్తకుప్పలు అమ్మలవుతున్నాయోచ్చ్ ..


విసిరేసిన విస్తర్లు
వాడేసిన బిస్తర్లు 
పడేసిన పేపర్లు 


హీనమైన వ్యర్దాలు 
ఘోరమైన ధరిద్రాలు


మోసే చెత్తకుప్పలు
పసిపిల్లలను సైతం 
మోస్తు తల్లులవుతున్నాయా.? 


లేదా


మోయలేక మొరటు తల్లి 
విసిరేసిందని 
ఆత్మీయంగా అందుకుంటున్నాయా.? 
మహర్షి 

Thursday, April 5, 2012

ఒక ప్రపంచం.. నా పదాల్లో..


సముద్రంలాంటి ఆకాశంలో ఒంటరి నక్షత్రం 
ఆకాశంలాంటి అనంతపు నేలపై ఒంటరిగా నేను 
నక్షత్రపు మిత్రువు జాబిలి 
నా నీడ నా చెలి  
జాబిలిని చూస్తూ నేను,నన్ను చూస్తూ ఆకాశం 
నిశ్చలంగా నిలబడిపొయాము
నిశ్శబ్ధం ఆవరించింది సమాదుల్లొ శవాలు నిద్రిస్తున్నాయని 
శ్మశానం పక్కన ప్రకృతి  వికృతంగా పడివుంది 
సన్నగా పలకరించి పోతున్న విచిత్ర విషూచిక 
ఎక్కడినుండో లయబద్దమైన చప్పుడు ఒకమాదిరి డప్పులా 
చిల్లుపడ్డ జేబుకు మరోపక్క నక్కిన నా గుప్పెడు గుండెది
అలుముకున్న చీకటిలో దాగిన రహస్యలెన్నో.!
అచ్చం నా మనసులోలగా
అంతులేనన్ని అంతుచిక్కనివి.!
మహర్షి