కదిలించే వాడు కవి క
రిగించే వాడు కవి క
లని చూపించే వాడు కవి క
లతని మరిపించే వాడు కవి క
ఠినంగా నిందించే వాడు కవి క
న్నుల బాషను చదివే వాడు కవి క
న్నీటితొ కాగడా వెలిగించే వాడు కవి క
న్నెల వన్నెలు వర్ణించే వాడు కావి క
రంకము చాటు మది లోతుని గ్రహించే వాడు కవి కా
వ్యంతొ బంధించే వాడు కవి కా
లానికి తాళంవేసె వాడు కాలం వేసిన తాళం తీసే వాడు కవి కా
గితం ప్రసవించిన పసి పదాలను పాలించి లాలించే వాడు కవి కా
లిపోయిన జీవితన్ని బూడిదైన కాగితన్ని కాచి తాగే వాడు కవి క
లాన్ని కపోతిలా విడిచి మనసుని మార్చి మార్చి దూషించి,ద్వెషించి,తిరస్కరించి,మోసగించి,అభినందించి,ప్రేమించి,ఆరాదించి,అనుమానించి,విసిగించి,రచించే వాడే కవి
మహర్షి
5 comments:
కవి గురించి బాగా వ్రాసారు.అలా "క "చివరన పెట్టటం ఎందుకండీ !తెలియకే అడుగుతున్నాను.
ఒకసారి నేను వ్రాసిన "కవితారవి " అనే కవితను చదవగలరు.
@ravisekhar. mundhugaa danyavadalu ravisekhar gaaru.. mee kavita chalaa bagundi.. ika vishayaniki vasthe.."ka vi ka" ante kallem ani ardham..kallem ante niyantrinche yantram.. oka kavi thanu raase prathi kavitaku sambandhinchina bavodhvegalaku lobadi raayalsi vuntundi.. aa bavodhvegala paridi dhaati vellakuna thana manasuni niyantrinchukovalasi vuntundhi.. ade vishayanni cheppakundane cheppalani chesina prayatnam lo ka alaa chivarana petta valasi vachindi..
anthe kaakunda
తురాయి కంటె ఆ
కు రాయికంటె కీ
చు రాయికంటె హిమాం
శు రాయి గొప్పవాడు
vanti enno goppa kavitalu rachinchina mahaa kavi sri sri gaari rachanala cheta prabhavitam eina vaadini nenu.. kanuka udatha baktigaa adapadhadapa naa rachanallo ayanni spoorthigaa teesukuntu ilaa prayogistu naa nivaali arpisthunnanu..
కొత్త విషయం చెప్పారు.శ్రీ శ్రీ గారి కవితలతో యువకుడిగా వున్నప్పుడు బాగా ప్రభావిత మయిన వాల్లల్లో నేను ఒకన్ని.ఆయన స్వేచ్చా కవిత్వం అంటే నాకు ఇష్టం.మంచి ప్రయోగం .నా కవిత నచ్చినందుకు ధన్య వాదాలు.
Mahesh gaaru, chaalaa baagaa vraasaarandi.
mee kavitallone kaadu ee comments lonoo manchi information vundi.
marokkasaari cheptunnaanu... chaalaa baagundi kavika....
@oddula ravisekhar gaaru.. kruthagnathalu..
@జాహ్నవి gaaru
chaalaa thanks andi..
Post a Comment