Sunday, October 28, 2012

ఏంచేయగలను..?


ఎన్నోరొజులుగా పగలు జీవించలేదు  
రాతిరి నిదురించలేదు
ఏ క్షణంలోను
కన్నులు వాల్చలేదు 
కలం కదల్చలేదు
అయినా కాలం ఆగలేదు

ఒక్కొ నిమిషం నన్ను వెక్కిరిస్తూ వెల్లింది
బాధపడ్డాను 
ఒక్కో గడియ నన్ను గేలి చేస్తు కదిలింది 
కుమిలిపోయాను 
అనంత సమూహంలో ఒంటరిగా 
నలిగిపోయాను 

నీ నవీనస్నేహసమూహంలో నన్ను మరిచినా 
ఎన్నడు అలక్ష్యం చెసావని నిందించలేదు 
నీ ఆనందం నా ఆనందానికి కారణమనుకున్నాను
అన్ని భరించాను మౌనంగా ఆనందించాను 

గుర్తున్నానా అని అడిగావు కదా 
నీకు తెలుస  
నా ఉచ్వాసనిశ్వాసలోనే కాదు 
ఆ రెంటికి నడుమ శూన్యంలోను 
గుర్తేవున్నావు 
నా మది లయప్రతిలయలోనె కాదు 
ఆ రెంటికి మద్య నిశ్శబ్ధంలోను   
మరువనేలేను 

అని ఆకాశమంత నా ప్రేమని అక్షరాల్లొ లిఖించగలను 
అర్దంకాలేదంటే వివరించగలను కాని
అర్దమేలేదంటే ఏంచేయగలను..?
మహర్షి 

Thursday, October 25, 2012

నీ పరిచయం


ఎక్కడో మానవ అరణ్యంలో
యాంత్రిక జీవనం గడుపుతున్న మృగాన్ని
పగలు తెలుపు రాతిరి నలుపు 
వేరే రంగులుంటాయని తెలియని గుడ్డినడక నాది
అదృష్టం దారి మార్చిందో లేదా రాత మార్చిందో 
ఈ యంత్రానికి నిన్ను పరిచయం చేసింది 
నీ పరిచయం నాలో మనిషిని నాకే పరిచయం చేసింది
నా కళ్ళకు సప్తవర్ణాలను తలదన్నే రంగుల్ని చూపించింది 
నేనెన్నడు  రుచైనా చూడని భావోద్వేగాలని 
విందుగా వడ్డించింది 
ఈ జన్మలో మరో జన్మని కలగంటున్న 
ఆనందాన్ని కలిగించింది 

కాని....

ఎక్కడో నా మదిలొతులో దాగిన 
ఒక ఆలోచన నిజంలా 
నన్ను ఆవరిస్తుందని అనుకోలేదు 

నీ పరిచయం కొల్పొయిన  మరుక్షణం
నేనేంటి ..?
ఆ క్షణమే నిష్టూరమైన నిజాల
చేదురుచి  తెలియమొదలైంది 
నీ పరిచయం....
ఒక వ్యసనమని...
అది కోల్పోవడం....
మరీ విషమమని...
అనువనువు వ్యాపించి....
నన్ను హరిస్తుందని..!

అమృతంలా చేరింది నా యదలోకి 
నీ పరిచయం 
వెళ్ళిపొతూ నీ జ్ఞాపకాన్ని వదిలేసావు 
విషంలా 
అంతే క్షణక్షణం క్షీణిస్తూ 
మళ్ళి నీ పరిచయానికై తపిస్తూ 
ప్రతీ క్షణం మరణిస్తున్నా...!
మహర్షి 

Tuesday, October 2, 2012


జోరుగా వర్షం
వరండాలో కాళ్ళు సరిగ్గ లేక ఊగుతున్న కుర్చి
కుర్చిలో కూర్చిని ఊగుతూ నేను
కురుస్తున్న చినుకులు పాదాలను ముద్దాడేలా 
వరండా గోడమీదగా చాచిన కాళ్ళు 
నాకు మాత్రమే వినిపించేలా
నాకు నచ్చిన సంగీతం చెవుల్లొ 
సంగీతానికి తాలం వేస్తు ఒక చేయి
మరో చేతిలో వేడిగా అల్లంచాయి 
అప్పుడప్పుడు అదిరిపడేలా మెరుపులు 
అదిచూసి ఎవరో నవ్వినట్టుగా ఉరుములు 
అంతా ఆనందమే అయినా 
మేఘాల చాటున దాగిన ఒక నక్షత్రంలా 
మసకబారిన మనసు చాటున ఏదో ఆలోచన
వెలిగి వెలగక.. తొలిచీ తొలచక..
మహర్షి 

మేఘం ఉరమలేదు
పిడుగులు పడలేదు

భూమి కంపించలేదు
సముద్రం ఉప్పొంగలేదు

అగ్నిపర్వతం పేలలేదు
ఉష్ణద్రవం చిమ్మలేదు 

గాలి విసరలేదు
చెట్లు విరగలేదు

గ్రహణం పట్టలేదు
చీకటి కమ్మలేదు

ప్రకృతి విరుచుకుపడలేదు 
ప్రళయమేది రాలేదు 

మరి ఎందుకీ శూన్యం 
ఎందుకీ నిశ్శబ్దం



ఒక హృదయం విరిగింది.. శూన్యం ఆవరించింది 
ముక్కలు ముక్కలై మిగిలింది.. శబ్దం మౌనంవహించింది 
                                                                                    మహర్షి