Thursday, October 25, 2012

నీ పరిచయం


ఎక్కడో మానవ అరణ్యంలో
యాంత్రిక జీవనం గడుపుతున్న మృగాన్ని
పగలు తెలుపు రాతిరి నలుపు 
వేరే రంగులుంటాయని తెలియని గుడ్డినడక నాది
అదృష్టం దారి మార్చిందో లేదా రాత మార్చిందో 
ఈ యంత్రానికి నిన్ను పరిచయం చేసింది 
నీ పరిచయం నాలో మనిషిని నాకే పరిచయం చేసింది
నా కళ్ళకు సప్తవర్ణాలను తలదన్నే రంగుల్ని చూపించింది 
నేనెన్నడు  రుచైనా చూడని భావోద్వేగాలని 
విందుగా వడ్డించింది 
ఈ జన్మలో మరో జన్మని కలగంటున్న 
ఆనందాన్ని కలిగించింది 

కాని....

ఎక్కడో నా మదిలొతులో దాగిన 
ఒక ఆలోచన నిజంలా 
నన్ను ఆవరిస్తుందని అనుకోలేదు 

నీ పరిచయం కొల్పొయిన  మరుక్షణం
నేనేంటి ..?
ఆ క్షణమే నిష్టూరమైన నిజాల
చేదురుచి  తెలియమొదలైంది 
నీ పరిచయం....
ఒక వ్యసనమని...
అది కోల్పోవడం....
మరీ విషమమని...
అనువనువు వ్యాపించి....
నన్ను హరిస్తుందని..!

అమృతంలా చేరింది నా యదలోకి 
నీ పరిచయం 
వెళ్ళిపొతూ నీ జ్ఞాపకాన్ని వదిలేసావు 
విషంలా 
అంతే క్షణక్షణం క్షీణిస్తూ 
మళ్ళి నీ పరిచయానికై తపిస్తూ 
ప్రతీ క్షణం మరణిస్తున్నా...!
మహర్షి 

2 comments:

Padmarpita said...

Touching poetry.

Unknown said...

thanku @ padmarpita gaary