జోరుగా వర్షం
వరండాలో కాళ్ళు సరిగ్గ లేక ఊగుతున్న కుర్చి
కుర్చిలో కూర్చిని ఊగుతూ నేను
కురుస్తున్న చినుకులు పాదాలను ముద్దాడేలా
వరండా గోడమీదగా చాచిన కాళ్ళు
నాకు మాత్రమే వినిపించేలా
నాకు నచ్చిన సంగీతం చెవుల్లొ
సంగీతానికి తాలం వేస్తు ఒక చేయి
మరో చేతిలో వేడిగా అల్లంచాయి
అప్పుడప్పుడు అదిరిపడేలా మెరుపులు
అదిచూసి ఎవరో నవ్వినట్టుగా ఉరుములు
అంతా ఆనందమే అయినా
మేఘాల చాటున దాగిన ఒక నక్షత్రంలా
మసకబారిన మనసు చాటున ఏదో ఆలోచన
వెలిగి వెలగక.. తొలిచీ తొలచక..
మహర్షి
No comments:
Post a Comment