Monday, December 20, 2010
Friday, December 10, 2010
ప్రేమ
ప్రేమ
ఇది రెండు పదాలలో మాదుర్యమా
లేదా రెండు హృదయాల మదురానుబందామా
ప్రేమ
పదాన్ని పదాన్ని పెనవేసుకున్నట్టు
ఎంతో అందంగావుంటూ ఎన్నొయదలను
ఆకర్షించే అద్బూతం
ప్రేమ
రెండు అక్షరాలు రెండు హృదయాలు
మాధురమైన అనుభూతి మరువలేని ఒక స్మృతి
ప్రేమ
శిధిలమైన జ్ఞాపకాలు,ముక్కలైన మనసులు
బూడిదైన ప్రమాణాలు అంతులేని అశ్రువులు
ప్రేమ
కాలాన్ని సైతం వెక్కిరించే చమత్కారం
కవులకు సైతం చిక్కని మహాకావ్యం
ప్రేమ
ఒకమదిని కవ్వించే మదూరామృతం
ఒకమదిని కడతేర్చే కాటికవిషం
ప్రేమ
అనలం,సలిలం,గగనం,పాతాళం,పవనం,ప్రళయం
మహర్షి
Wednesday, November 24, 2010
ఏమని రాయను..?
ఏమని రాయను దేనిగురించి రాయను
రాయాలని వున్న రాయలేకున్నా
రాజకీయ రంగుల గురించి రాయనా
శృంగార భంగిమల గురించి రాయనా..?
లేదా
నిష్ఠురమై నిస్తేజమైనా నిజం రాయనా
అధ్బుతమొ ఆనందమొ తెలియని అబధ్దం రాయనా...?
చెడును చూస్తూవున్న చేవలెని జనాలలాగా
జనాల గుణాల లగా
నిజం చెప్పలేక నీళ్ళు మింగుతున్న నికృష్ఠునిలా
రయాలని వున్న రాయలేకున్న....
మహర్షి
Tuesday, October 12, 2010
Monday, October 11, 2010
నన్ను నేనే కడతేర్చుకుంటున్నా
నన్ను నేనే హతమార్చుకుంటున్నా
నాలోని చీకటి చెలిని కౌతుక ఖడ్గంతో వదిస్తున్నా
నా ప్రియ కాంత ఏకాంత కాంతను ఆనందనందకంతో అంతమొందిస్తున్నా
ఉన్న ప్రేమని లేదని లేని ద్వేశాన్ని ఉందని
మార్దవమగు నా మదికి కఠినత్వపు రంగులు చిమ్మి భయటకు గెంటేసా
నా కోమలత్వం కనబడకుండా నిర్బటము నటిస్తున్నా
కాని ఎందుకు నేనిలా.?
అర్దం కాని అలొచనలా,అంతులేని అవేషాలా,అపార్దల అహలా..?
మహర్షి
Thursday, September 9, 2010
దేవత..!
కోమలత్వనికి కొత్తర్దం ఈకోమలి
ప్రపంచంలోని ప్రతీఅందానికి పర్యయపదం ఈ సుందరి...
నయాగారాల జలపాతాల జాలువారె హొయలు ఆమె కురులు
నింగియందు ఇంద్రధనస్సు కన్నా మిన్న ఆమె కనుబొమ్మల అందం
ఆకాశంలొ జాబిలి ఒకటె ఆమె కళ్లలొ రెండు
ఒంకార ప్రతిరూపాలు శంఖాల ప్రతిభింబాలు అమె శ్రవనాలు
ఆమె అదరాల వడిలొ జనణం గులాబి వర్ణం
వెన్నెల వేల చిన్నగా వీచె చిరుగాలి ఆమె నవ్వు
కోహినూర్ వజ్రన్ని సైతం తేలికచేసే తేజస్సు ఆమె వదనం
మరి ఆమె నడకల అందం మయురాల నాట్యమే
తన స్పర్శ తగిలినంత తన్మయమవును మనసంతా
చిరుగాలికి రెపరెపలాదుతూ నాట్యంచేసే దీపం తనరూపం...
నేను వర్ణించిన ఈకాంత...
దివి నుండి వచ్చిన దేవత....!
మహర్షి
Thursday, August 19, 2010
నర్తకి
నీవొ నర్తకివి
నా హ్ర్యుదయాన్ని రంగస్థలం చేసి
బహుచక్కగా నర్తించావు
నీకు తెలియనిదా నా యద అతిసున్నితమని
నా యదసవ్వడి సంగీతంలావిని తన్మయించి ఆడావా..?
నా మదిచప్పుడు చీరాకుగావిని పరాకుతొ ఆడావా..?
ఏదైతేనేమి
నీ అడుగుల అడుగున నా అంతఃకరణము అవధ్వంసమైనది
నీ తాండవంలొ నా హ్రుది భేదిల్లిపొయింది
నీ పాదాలు పంజళ్ళుద్రొక్కగా నా మది పెటిల్లిపొయింది
ఓ అర్దంలేని అనుబంధమా
ఓ క్షణమైనా
నీ మువ్వల సవ్వడిలొ నా యదసవ్వడి వినలేదా లేదా వినరాలేదా
నా హ్రుది స్పర్శకి నీ పాదాలు చెలించనేలేదా ...?
మహర్షి
Tuesday, June 8, 2010
జీవితం
జన్మిస్తాం మరణిస్తాం మద్యలొ మరి ఏంచెస్తాం
కొందరన్నారు జీవిస్తామని,ఇంకొందరన్నారు నటిస్తామని
మరికొందరన్నారు పొరాడతామని.
సందిగ్ధసమాదానానికి అప్పుడె పుట్టిన బిడ్డ ప్రశ్న
కేరు కేరున కేకలు పెడుతుంది నన్నేది నమ్మమని
ఇంతలొ సమదానం చెబుతానంది సమాజం
జీవించడానికి పొరాడెవారు కొందరు
పొరాడేందుకె జీవించేవారు కొందరు
జీవితంలొ నటించేవారు కొందరు
నటిస్తూ జీవించేవారు కొందరు
జీవించినా,పొరాడినా,నటించినా
పుట్టుకకి మరణానికి ఒక్కటే అందరు
జన్మించేది తల్లివొడిలొనే...
మరణించేది మట్టివొడిలొనే...!
మహర్షి
Saturday, May 29, 2010
నివాళి
ఓ మహాకవి నీ కలానికి మా జొహర్లు
ఎందరి హ్రుదయాల్లొ సాహసాన్ని రచించావో
ఎందరి హ్రుదయాల్లొ ఆసలను ఆశయాలను లికించావో
మరెందరి హ్రుదయాల్లొ ప్రేమను ప్రేరెపించావో
ఇంకెందరి హ్రుదయల్లొ కవితా స్పూర్తిని నింపావో
ఈ భువనంపై ఇన్నాల్లు కురిసిన వేటూరి వెన్నెల
ఇక అమావాస్యగా మిగిలెనా..?
అక్షరమై వచ్చావు భువనానికి
కవితవై వొదిగిపొయావు కాగితపు నింగికి
స్పూర్తివై మిగిలావు ప్రతీ కవికి ప్రతీ కవితకు
మహర్షి
Thursday, April 1, 2010
హైద్రబాదీని నేను...
ముస్లిమ్ని కాను హిందువుని కాను
ఏమతానికి చందని హైద్రబాదీని నేను
జనారణ్యంలోని జంతువులమె మేమంతా
రంజాన్ షీర్ కుర్మ,రామనవని పానకాన్ని
ఏకోదరుల్ల పంచుకున్నాము
ఏపొలిటికల్ పెద్దపులులొ తెలియవుకాని
జనారణ్యపు జంతువులమైన మమ్మల్ని
ముస్లిం మేకలను,హిందు గొర్రెలను చేసి
మతాలగీతలు గీసి మాగొంతులు కోసారు
రామాలయంలొ రాముడు బాగానే వున్నాడు
మసీదులొ అల్ల హాయిగానే వున్నాడు
హైద్రాబాదీనైన నేనె అన్యయమైపొయాను
అడుగువేయలెకున్నను
మహర్షి
Saturday, March 20, 2010
యుద్దం..
మందుపాతరల మబ్బుల మద్యల నక్కి చూస్తున్న వెన్నెల
కెరటాల కవాతులతొ యుద్దానికి దూకుతున్న ధరణి
శతకోటి చుక్కల సైన్యంతొ చంద్రుడు
గ్రహాల గుంపులతొ సాటిలైట్స్ సమూహంతొ
సమరానికి సిద్దమైన సూర్యుడు
మేఘాల ఘీంకారాలు యుధ్దభేరిని మోగించాయి
అంతలొ...
అనుకోకుండా అపరిచితుడిలాంటి మానవుడు
ఆక్సిజన్ ఆవహించుకుని
కార్బండైఆక్సైడ్ కలగలిసిన
కాలుష్యపు కఠినస్త్రాలతొ
సమస్తాన్ని ఆక్రమిస్తున్నడు.. అంతం చేస్తున్నాడు...!
మహర్షి
Thursday, March 11, 2010
ముఖకవలికలొ మధురమైనది మందహాసం
నాయద మోమున చిందిన మందహాసాన్ని చూసి
నిర్మలమైన ఆకాశంలొ నాకోసం
నవ్వుతున్నాయి మేఘాలు
మేఘాలను చూసిన జాబిలి
జాబిలిని చూసిన తారలు
పల్లపొడి ప్రసారాల మాదిరి
పల్లికిలించి పరవసిస్తున్నరు
నా అనందం అనంతాన వ్యాపించింది..
నా సంతొషాలా స్వరాలకు
పక్షులు పల్లవి పాడగా
చెట్లుచేమలు చరణాలను కూర్చాయి
ప్రపంచమంతా పరవసించి
నాతొ గొంతుకలిపింది
అంతరిక్షంలో సైతం
అంతులేక కురిసింది ఆనందాల వాన..!
మహర్షి
Saturday, February 6, 2010
ఎలా...?
నిప్పుల్లొ నిలబడిన చెలించని నన్ను
వదలని నీ ద్యాస దహించేస్తుంది
ఏబందానికి అందని నన్ను
నీ బంధం బందీని చేస్తుంది
ఏభావనకి చదరని నేను
అందని నీ ఆదరనకై ఆరాటపడుతున్నా
ఏఅస్త్రము చేదించని నా గుండెను
నీ చూపుల చురకత్తులు చీల్చెస్తున్నయి
ఆవేషం తప్ప ఆలొచనలేని నన్ను
అనుక్షణం నీకై ఆలొచింపచేస్తున్నవు
రౌద్రంగా వుండే నా కన్నులు నేడు నిర్మలంగా
నీకై కలలు కంటున్నాయి
మౌనంగా మట్లాడే నా పెదవులు
నీ పేరును కాక మరేమి పలకటంలేదు
నాకే తెలియకుండా నన్ను సైతం నీకు అనువుగా మార్చుకుని
నీకేమి తెలియదంటె ఎలా...?
మహర్షి
Wednesday, February 3, 2010
కష్టం
అచ్చుతప్పు కష్టాలు
మద్యహ్నం నిదుర లేచేవాడికి ఉదయాన్నె లేవడమె మహాకష్టము
ఎండాకాలంలొ ఎ.సి పనిచేయకపోయిన సీతాకాలంలొ హీటర్ పనిచేయకపోయిన అదే అతిపెద్ద కష్టము
ఏసంధర్బంలొ ఏబట్టలు వేసుకొవాలొ తెలియని విచిత్రమైన కష్టం
బలాదూరు తిరుగుతున్న సమయంలొ బైకు ఆగిపొతె భరించలేని కష్టం
పదివేల పాకెట్ మనీలొ ఒకవెయ్యి తగ్గితె తీవ్రమైన కష్టం
కష్టానికె కష్టమైనంత కరీదైన కష్టం.....
అసలైన కష్టాలు
నకనకలాడుతున్న పేగులతొ బుక్కెడు బువ్వకి భిక్షమెత్తుకునె
పసివాడిని అడుగు కష్టమంటె
తలపైన తట్ట, తట్టనిండ ఇటుక,
ఇటుక ఒకటి జారి కాలివేలు నలిగితె
నల్లమట్టి చల్లి నెత్తురానకట్ట కట్టి
నలపై మెట్లెక్కె కూలీని అడుగు కష్టమంటె
నడినెత్తిన సూరీడు నడుముపైన మూట
మూటదింపి ఇంటికెల్లి మెతుకు మింగి పడుకుంటె
కమిలిపోయిన వీపుతొ కునుకైనా రాని
కార్మికుడిని అడుగు కష్టమంటె
వేలువేలు అప్పుతెచ్చి పొలం దున్ని పంటవేసి
పంటమొత్తం పురుగు పడితె
పురుగుమందు తెచ్చి కొట్టిన పంట చేతికి రాకపోతె
ఉరితాడుకు ఊయలూగిన రైతునడుగు కష్టమంటె
లోకమంతా వెక్కిరిస్తె,వెక్కి వెక్కి
ఏడుస్తున్న వినిపించక
కన్నబిడ్డను చెత్తకుప్పల విసిరివేసిన
కన్యతల్లిని అడుగు కష్టమంటె
విసిరివేసిన విస్తర్లలొ
వెతికి వెతికి మెతుకు మింగి
బతుకునీడ్చుటకు అలమటించే
అనాదనడుగు కష్టమంటె
మహర్షి
Wednesday, January 27, 2010
ఆగ్రహం
బద్దలైన అగ్నిపర్వతంలా అంతులేనిది నా ఆగ్రహం
వంద కిలోల ఆర్.డి.ఎక్స్ విస్పొటనంలా విపరీతమైనది నా కోపం
వేయి మదపుటేనుగుల మాదిరి ద్వజమెత్తిన ఆగ్రహం
బుసకొట్టిన నాగుని వడిసి పట్టిన ముంగీస మదహంకారం నా కొపం
నింగినిసైతం మింగె అంతులేని అమావాస్య నా ఆగ్రహం
వంద భూకంపాల బీభత్సంలా బీకరమైంది నా కోపం
మహా సముద్రాలన్ని మూకుమ్మడిగా ముంచెత్తిన సునామి తీవ్రత నా ఆగ్రహం
అంతులేనిది,అదుపులేనిది,ఆలొచన అన్నది అసలే లేనిది
మహర్షి
Monday, January 18, 2010
నా చేరువలొ నువ్వు లేని వేళ ఈ దూరం మీద కోపం
నీ మీద కాదు
నీ రాక తెలిసిన వేళ నిలిచిన నిమిషం మీద కోపం
నీ మీద కాదు
నీ రాక ఆలస్యమైన వేళ తొందరగా గడిచిన కాలం మీద కోపం
నీ మీద కాదు
నీవు వచ్చిన వేళ నీతొ మాట్లడలేని నా మౌనం మీద కోపం
నీ మీద కాదు
నీవు వెళ్ళిపోతున్న వేళ నిన్ను చేరలేని దూరం మీద కోపం
నీ మీద కాదు
నా జీవన ఎడారిలొ వర్షించిన హర్షితం నీవు
నా అంధకారపు ఆకాశానికి జాబిలి నీవు
నీపైన నాకు కోపమా అది సాద్యమా....!
మహర్షి
Subscribe to:
Posts (Atom)