Friday, July 13, 2012
Tuesday, July 3, 2012
మహర్షి..
నా ఆస్తి 56 అక్షరాలు
నా అందం అంతులేని ఆలోచనలు
నా తెలివి మాసిపొని జ్ఞాపకాలు
నా మనసు అంతులేని అగాదం
నా రక్తం వెచ్చని ఎర్ర సిరా
నా జీవితం జాబులేని ప్రశ్నలు
నా కుటుంబం వసుదైక భావం
నా ప్రేయసి ఏకాంత కాంత
నా మిత్రువు అష్టదిక్కులు,పంఛభూతాలు
నా శత్రువు కఠినమైన కాలం
నా నివసం సువిశాల శూన్యం
నా భాష మదురమైన మౌనం
నా మార్గం అంధకార అతిపథము
నా గమ్యం స్వేఛ్చా ప్రపంచం..
నా పేరు
మహర్షి
Sunday, June 10, 2012
కొన్ని ఆలోచనలు కొన్ని అనుభవాలు కొన్ని అక్షరాలు-2
నిన్నటి నడి రాతిరి నా ఆవేదన సముద్రమైనది....
మరుక్షణమున నా అనందం ఆకాశమైనది...
________________________________
ఆకాశమంత ప్రేమ నాది
అనువంతైనా అందుకోవు నీవు
నా మాటైనా అర్ధమే కాదు నీకు
నీ మౌనమైనా మాటలా వినిపిస్తుంది నాకు
నీ ప్రపంచంలొ కేవలం ఒక పాత్ర నేను
నా సమస్తప్రపంచానివే నీవు
_________________________________
తీరానికి తలలు కొట్టుకుని అంతమైపొయాయి అలలు
అర్దమే కాని నిన్ను ఆరాధించి ఆవిరైపొయాయి నా ఆశలు
ఇక ఎప్పటికి నిన్ను విసిగించవు నా రాతలు,చేతలు,కవితలు
_________________________________
నిత్యం నా మది చప్పుడు నువ్వనుకున్ననే
మరి నీకెందుకు అది అపశృతిలా వినిపించిందో మరి..?
_________________________________
మనిషి చచ్చిపొతె ముందు ఏడుస్తారు
తరువాత మట్టిలొ పూడుస్తారు
మనసు చచ్చిపొతె ముందు జ్ఞాపకాలను పూడుస్తారు
తరువాత మౌనంగా ఏడుస్తారు..
_________________________________
మహర్షి
Friday, June 8, 2012
నేను నా గది
నేను నా గధి
వైసల్యం చిన్నది
గిర్రున తిరిగే పంఖా
అలిసిపోయి చూస్తుంది నా వంక
నిత్యం ముసిన కిటికీలు తలుపులు
కనిపించవు నా హృదయంలొ తలపులు
చీకటితో నిండిపోయింది గది
ఆలోచనలతో నిండిపోయింది నా మది
ఈ గదిలో కోన్ని అరలు
నా హృదిలో ఎన్నో అలలు
అటక మీద పుస్తకాలు
పుస్తకాల్లొ కొన్ని జ్ఞాపకాలు
ఈ గదిలో నేను
నా మదిలో నీవు
అందుకే నేను నా మది
వీడలేము ఈ గది
మహర్షి
Monday, June 4, 2012
కొన్ని ఆలోచనలు కొన్ని అనుభవాలు కొన్ని అక్షరాలు
వెలుతురులేని ఈనిశిరాతిరిలొ
మెరుపులేని తారలు నింగిలో
అలుపులేని పిల్లగాలి వీదిలొ
నిద్రలేని నేను నా గదిలో..!
______________________________
సూర్యునికై ఎదురుచూసే సూర్యగంధిల
జాబిలికై ఎదురుచూసే సముద్రంలా
నీకై నే ఎదురుచూస్తుంటానే
మారి నీ రాక నాకే తెలుపకపోతే
చిన్నబోదా నా మది
______________________
నిన్న మరి నేడు
అందంగా వుంది రేడు
offlineలొ మెఘాలు కరణమా
onlineలొ జాబిలి కరణమా...?
_______________________
గడిచిన క్షణంలొ నా ఆవేదనవి నువ్వే ఈ క్షణంలొ నా ఆనందానివి నువ్వే....నా మదిని ఆడించే అద్బుతానివి నువ్వు...!
________________________
నా కలానికి అక్షరాల ఆజ్యం నిండుకుందా లేక నా మది అంతులేని ఆలొచనలతో నిండిపోయిందా..... కాగితాలన్ని కాలిగానే వుంటున్నాయి
________________________
మనిషికి వున్న అన్ని బంధాలకు ఎన్నో పేర్లు
కాలక్రమేనా అన్ని కలుషితమైపొయాయి
అందుకే పేరులేని అనుబంధం మనది
ఆకాశమంత అందమైనది....
అంతకంటే స్వచ్చమైనది..!
_________________________
మహర్షి
Sunday, June 3, 2012
నిన్ను చూసిన క్షణం
అరె...! ఏమిటి ఈ అనందం..?
ఆకాశాన్ని మించినట్టు
అరె...! ఏమిటి ఈ సంతొషం..?
సంద్రమంతా నిండిపోయినంత
అంతా ఇంతా అని ఎంత
వర్ణించినా వర్ణించగలనా
నా అనందాన్ని..!
నువ్వొ అద్బుతం.
నువ్వొ ఆశ్చర్యం....
నువ్వొ అద్వైతం ...
అదే నువ్వు నా ఆనందం.
అందుకే
నిన్ను చూసిన క్షణం....
అంచనాలకి,ఆకాశానికి, అంబుధికి అంతెందుకు అక్షరాలకే అందనంత ఆనందం...
మహర్షి
Wednesday, May 2, 2012
రైల్వే స్టేషన్
ఇంటి వెనక రైల్వే స్టేషన్
మనసు చెదిరినప్పుడు
మరీ ఆనందం వచ్చినప్పుడు
మరెప్పుడైనా వెల్తుంటాను అప్పుడప్పుడు
నా రాక ఆలస్యమైనట్టు
నాపై అలిగినట్టు
ఆమూలన విసిరేసినట్టు
ఒక సిమెంటు గట్టు
కలవలేక కలిసున్న పట్టాల చుట్టాలు
కలిసి పలకరించారు
అంతలో కూతపెడుతూ కుశల ప్రశ్నలేసే
మరో మిత్రుడు రానే వచ్చాడు
ప్లాట్ ఫార్మ్ మీదున్న పదిమందిని
తనతో పాటు తీసుకెల్లాడు
ఏకాంతాన్ని నాకు వదిలేస్తూ
కదలలేక కదులుతున్న గూడ్సు బండిలా
సమయం సాగుతుంది
నా కళ్ల ముందున్న కాలి కుర్చీలో
కాళ్లు చాచి పడుకుంది చీకటి
తనతోపాటు తెచ్చుకున్న నల్ల గొంగడి పరుచుకుని
ఇంక చెసేదేమి లేక
వెలుతురు పట్టుకొచ్చే వేకువ కోసం వేచిచూసానేను
మహర్షి
Subscribe to:
Posts (Atom)



