Saturday, December 24, 2011

నా మరణం


నేను మరణిస్తాను
నా తల మీద రెపరెపలడుతూ దీపం
కాల్ల ముందు పొగలు కమ్ముతు కుంపటి
కొందరు వెక్కి వెక్కి గుండె పగిలి ఏడుస్తారు 
మరికొందరు వెక్కిలిగా పడి పడి పగలబడి నవ్వేస్తారు
కొదరు జీవిచడం తెలీదంటారు  
మరి కొందరు జీవితం తెలిసినవాడంటారు
హీనుడనని కొందరు దీనుడని ఇంకొందరు ధీరుడని మరికొందరు 
గుఢచారులల గుసగుసలాడుతారు
ఇదంతా తీక్షనంగా వీక్షిస్తుంటాను  
తాటాకు పాడె మీద పడుకుని నేను
మొసేవారెవరు ముందు నడిచేవారెవ్వరు
లెక్కలేస్తారు కలిసికట్టుగా అందరు
నాపై చల్లిన చిల్లర ఎరుకుంటు
పిల్లాడొకడు పరిగెడుతూ ఉంటాడు
నా శవయాత్ర కాటికి చేరగా 
చితి పేర్చి దహనం చేసి 
దుఖ్ఖాన్ని దిగమింగేసి నటిస్తూ వెల్లిపోతారు 
కాలుతున్న చితి నుండి 
కట్నం వచ్చిన కాటికాపరి ఆనందాన్ని
ఏరుకున్న చిల్లర పొగేస్తున్న చిన్నోడి సంతోషాన్ని 
చూస్తు చావులో బ్రతుకని సంతోషిస్తూ 
నిప్పుల్లొ కాలిపోతాను నింగికి ఎగిరిపోతాను 
మహర్షి

Tuesday, December 13, 2011

ఆనందం


నిన్ను చూసిన క్షణం నా ఆనందం
అక్షరాలలో అభివర్ణించేది కాదు 
అందుకు బదులుగా 
నక్షత్రాలన్నీ నింగినుండి పోగుచేసి 
నీపై కురిపించాలనివుంది
నిండు చంద్రుడిని ముప్పవు ముక్క విరిచి
కర్పురంలా వెలిగించి నీకు దిష్టి తియ్యాలనివుంది
ఇంద్రధనుస్సుని తెచ్చి 
నీ పసిపాదాలు కందకుండా తివాచిలా పరచాలనివుంది 
మేఘాలన్నీ చెరిపేసి ఆకాశాన్ని మడతపెట్టి 
నీ పానుపులా మార్చాలనివుంది
ఒక్క మాటలో  
నా ఆనందాన్ని రెట్టింపు చేసి 
నీకు అందిచాలనివుంది నా అనుబంధమా 

మహర్షి

Sunday, December 11, 2011

మనిషి చచ్చిపొతె ముందు ఏడుస్తారు
తరువాత మట్టిలొ పూడుస్తారు
మనసు చచ్చిపొతె ముందు జ్ఞాపకాలను పూడుస్తారు
తరువాత మౌనంగా ఏడుస్తారు
 మహర్షి

ఆనందం

రెక్కలు విరిగిన పక్షికి అవి తిరిగొస్తే..?
ఒడ్డున పడ్డ చేపకి అల దరికొస్తే..?
ఈ క్షణం నేను ఆ పక్షిని,చేపని...!
 మహర్షి

Tuesday, December 6, 2011


నింగి సంద్రపు అడుగున 
దాగిన తెప్పల ఆల్చిప్పలు
ఆల్చిప్పల రెప్పలలొ 
దాగిన చిరు చినుకుల ముత్యాలకై 
వేచి వేచి నింగికేసి ఎదురుచూసే రైతును చూసి
కరుణించి వరుణించేనా ఆ నింగి.?
                                                                                     మహర్షి 

Sunday, November 6, 2011

నాకు గతం కావాలి...!

ఈక్షణం భ్రమించే భూమి స్థంభించిపొవాలి 
ఒకేఒక్కసారి వ్యతిరేక దిసగా తిరగాలి 
ఆనాటి రాతి యుగానికి కాదు 
క్రీస్తు యుగానికి కాదు 
కేవలం నీతొ గడిపిన నిన్నటి క్షణాల వరకు
నేనే నీ ఏకైక స్నేహమైన ఆనాటి కాలానికి
అనుమానాలకి తావులేని నీ పసిమనసు ప్రాయంలోకి
నా ప్రపంచం నీవైన ఆ ప్రపంచంలొ, 
నాతొ పాటు ఆనందించిన జ్ఞాపకాల గతంలొకి 
నిత్యం నే గెలిచే అంతక్షరిలో నీతొ నేనోదిన నిమిషాల్లొకి
నింగి ఎండను నీమీద పడకుండా 
నీకే తెలియకుండా 
నీడలా నీవెనక నడిచిన నిరుడుదారుల్లొకి
ఎంత అవివేకినో కదా మరి నేను..?
పూడ్చేసిన గతాన్ని తవ్వగలనే కాని 
మరణించిన మధురానుభూతికి ప్రాణం పోయాలేను కదా మరి...!  
మహర్షి 

Monday, October 24, 2011


ఒక రెక్క విరిగి పడింది గువ్వది
ఒక చుక్క రాలిపడింది నింగిది
ఒక చినుకు జారిపడింది మబ్బుది
ఒక పువ్వు తెగిపడింది కొమ్మది
ఒక బంధం విడిపడింది మనది
ఒక జ్ఞాపకం గాయమైంది నీది
ఒక హ్రుదయం ముక్కలైంది నాది 
మహర్షి 

Monday, October 17, 2011

నేను..!



బంధలకు నే బానిస కాననుకున్నాను 
అనుబంధాలకు అతీతుడినని విర్రవీగాను 
చేరువైన వారిని దూరంగ నెట్టెసాను 
ఆదరిస్తే చీదరించాను 
అభిమానిస్తె తిరస్కరించాను 
ప్రేమించినవారి ప్రాణాలు తీసాను 
ఏనాడు పశ్చాత్త పడలేదు   
నన్ను మెచ్చిన వారు ఎందరో వున్నారని  
నన్ను నచ్చిన వారు ఇంకెందరో వున్నారని 
నేను అసమానం అని ఆకాశమని ఆనందించా  


నా పొగరును పరాభవించడానికి నిన్ను పరిచయం చేసాడొ ఎమో 
ఆకాశంలా వున్న నాకు జాబిలిని చూపించాడు 
మెరిసిపోతున్న తనతో మైత్రిచేయించాడు 
పసిపాప మనసుతనది అంతకంటే ఆనవ్వు అందమైనది 
వత్సములు మాసములా మాసములు వారములా 
వారములు రోజుల రోజులు క్షణాల్ల గడిచిపొయాయి    
బగవంతుడిలా వున్న నేను భక్తునిలా మారిపోయా   
నా మేధస్సును మరిచాను తన పాదాలాకింద నా మనస్సుని పరిచాను
ఈక్షణం తన మాట నాకు శాసనం  
తన బాధ్యత నాకు వరం 
తన ఆనందం నా కర్తవ్యం 
తన క్షేమం నా ఊపిరి
ఇదే నాజీవనశైలిగా బ్రతుకుతున్నాను  
అంతలొ ఒక అపార్ధం అమావాస్యలా మింగేసింది 
జాబిలిని కాదు ఆకాశమైన నన్ను 
ఇన్నళ్ళ అనుబంధానికి అర్ధం లేకుండాపొయింది 
ఆకాశమైనా నేను తన బంధానికో 
అనుబంధాల్లొ అపార్ధానికో అంతమైపోతున్నాను...   

మహర్షి 

Sunday, October 16, 2011

నా ప్రపంచం

నాదొక వేరు ప్రపంచం 
నేను తప్ప మరెవరు కనిపించని నాదైన సొంత ప్రపంచం నా వింత ప్రపంచం
నా ప్రపంచానికి కాపలగా గడియారపు జంట సైనికులు నిలకడలేక నిత్యం గస్తికాస్తుంటారు 
నన్ను నిద్రలెపేందుకు సూర్యుడు లేడక్కడ   
తెలవరంగానే నీకు సందేశం ఇవ్వలన్న ఆలోచన తెలవారకుండనే తడుతూనే వుంటుంది నా తలు(ల)పు
నా ప్రపంచంలో గాలికి సైతం చోటుండదు  
నీ నిశ్వస నా ఉచ్చ్వాసగా నానిశ్వస నీ పేరుగా ఇదే నా తీరుగా బ్రతుకుతున్నవాడిని     
నా కాలక్షేపనికి గతం నాటిన జ్ఞాపకాల తోటలొ రాలిపడ్డ పూలను అతికిస్తూ వుంటాను  
అప్పుడప్పుడు నీ పలుకులు పట్టుకొచ్చె నెట్వర్క్ నేస్తాలు..! 
నీ క్షేమసమాచారం చేరవేసె యాంత్రిక చుట్టాలు..! 
నా ప్రపంచంలొ రాతిరి నక్షత్రాలుండవు 
ఉదయం నుండి నీకై నెరాసిన అర్ధంకాని అక్షరాలె ఆకాశంలొ కాలిపోతు కనిపిస్తాయి   
నన్ను నిద్దురపుచ్చేందుకు జాబిలి లేదక్కడ  
నీ మోమును జాబిలిగా నీ నవ్వును వెన్నెలగా కలగంటూ కల్లుమూసుకుంటాను..  
వింతేమిటంటె నాదైన ప్రపంచంలొ నన్ను గూర్చిన తలపు ఒక్కటీ వుండదు   
ప్రతీ చోట నీ ఊహలే ప్రతీ క్షణం నీ ఊసులే   
మహర్షి 

Wednesday, October 12, 2011

నా నిఘంటువు...


ఇది పుస్తకంలొ నే రాసిన పుట కాదు 
నా మది కాగితంపై కాలం రాసిన కవిత 
సానంతొ ఒక్కో వేటు వేస్తు చెక్కిన రాత   
వేటుపడిన చోటల్ల రక్తపు రంగున గీత 
ప్రతీ అపార్ధాల అక్షరానికి మరో అర్ధం  
యుగాల తరబడి నడిచా నిఘంటువుల నడుమన  
వెతికిన చోటల్ల వెంటపడి తరిమిన వోటమి 
విది వెతికేందుకు సాయం చేసింది  
విచిత్రంగా నా పదనిధి నీవంది 
నా ప్రతీ అక్షరానికి అర్ధం నీవయ్యవు కాని ఆకరిలొ 
నా ప్రపంచమే అపార్ధమని ఉపద్రవంలా ముంచేసావు   
మహర్షి 

Sunday, October 9, 2011

అనుబంధం


ఒక అనుబంధానికి బంధువులు ఇద్దరు
ఆ ఇరువురికి తెలియని విషయం
ప్రతీ బంధానికి ఒక ముడిపడుతుందని
దానికి కాలం జ్ఞాపకాల కళ్లెంవేసి బిగిస్తుందని


అచ్చం అలాగె ముడిపడిన మన బంధానికి 
కాలం చెల్లిపోయిందొ లేదా కళ్లెం వూడిపోయిందొ 
అనుబంధపు ముడి చిక్కులా మారిపొయింది 
అంతలో బంధం నిన్ను విడిచిపోయింది  
వదలలేక నన్ను మెడకు వుచ్చులా బిగిసింది 

                  మహర్షి 

తీరానికి తలలు కొట్టుకుని అలలు
అపార్ధాల అంచులు దూకి నేను 
సముహిక ఆత్మహత్యచేసుకున్నము 
అలల ఆత్మలు ఆకాశానికి ఎగిసి మేఘరూపం దాల్చాయి
నా ఆత్మ దూలిగా మారి నీపాదాలు పట్టుకు వేదిస్థొంది 
తానూహించినట్టి తుచ్చ నీచ తత్త్వము తనదికాదని..!


                                                   మహర్షి 

Monday, October 3, 2011

మౌనకావ్యం..!


నా కాగితంలొ పిచ్చిగీతలు
నీతో పలకలేని నా మదిమాటలు....


నేరాసిన అక్షరాలు కంటికి కనిపించవు
మనసుతో చూడగలవ మరి..?


మౌనం నా పరిభాష
నీకు అర్ధమౌతుందని నా అత్యాశ...?


నా మౌనం చెవులకు వినిపించదు 
కంటితొ వినగలవ మరి..?  
                                                               మహర్షి 

Thursday, September 22, 2011

వార్త పత్రిక


జాబిల్లిని చూస్తు నిద్దురపోయిన నన్ను
పొద్దువాలగానే నిద్దుర లేపింది ఒక ఆర్తనాదం 
ఒక్కసారిగా కనులు తెరచి తలుపు తెరిచా
మంచుతో మసికొట్టుకుపొయింది ప్రపంచం
ముంగిలిలొ ముద్దుగా దిద్దిన ముగ్గులు 
మురుస్తూ ముందుకు వెళ్లిన నాకు
మరింత చేరువలో చెవిని చేరింది ఆర్తనాదం
అటుపక్క ఒక అడుగు వేసా
రక్తపుమడుగులో పడివున్న వార్తావనిని చూసి 
వొనుకు పుట్టింది వెన్నులొ 
వెన్నులో భయన్ని తాకట్టుపెట్టి 
అప్పుతెచ్చుకున్న దైర్యాన్ని కర్చుపెట్టి 
ఆపన్నహస్తం అందించి హక్కున చేర్చుకున్నాను 
అప్పుడు చెప్పింది నన్ను అబ్బుర పరిచిన
తన ఆవేదన అంతా 
అక్కరకు రాని నిజాలు 
అంతులేని అబద్ధాలు 
మానవ మృగాల చేతలు 
అవి తోసిపుచ్చే నేతలు 
కుంభకోణాల లోతులు 
రాజ్యంగానికి పడ్డ గోతులు 
భరించలేని అక్రమనుబంధాల బూతులు 
మనిషి చేసే మారణహొమ తీవ్రతలు 
సాగుతున్న సమ్మెలు 
శిధిలమైన  బొమ్మలు 
దారులన్ని గతుకులు 
భారమైన బతుకులు 
అక్షరాల మూటలొ అన్ని కలిపి నాపైమోపి 
మెడపట్టుకుని వీదిలోకి విరిసిపారేసారని.....! 
  మహర్షి 

Saturday, September 10, 2011

ఏమని చెప్పను...



ఏమని చెప్పను ఎవరికి చెప్పను
నీ మీద ప్రేమను మరీచానంటూ
మదురాణుభూతులను మసిచేసానంటూ
మనసునే మోసగిస్తూ,కఠినంగా కనిపిస్తూ
లోలోన కుమిలిపోతున్నానని


ఏమని చెప్పను ఎవరికి చెప్పను
ఏబందానికి నే బానిసాకానని
ఎవ్వరికీ నే లొంగనివాడని
ఇనా ఈ ప్రేమకి లొంగి
తన బంధానికి బానిసనయ్యానని
ఏమని చెప్పను ఎవరికి చెప్పను


ఏమని చెప్పను ఎవరికి చెప్పను
నా కంటిలో కనుపాప నీవని
నా గుండెలో రూపం నీవని
నా మదిలో ప్రతీ తలపు నీవని
ఇంకా ఏమని చెప్పను ఎవరికి చెప్పను
మహర్షి


Wednesday, August 31, 2011

నా రచన


నా కవిత రక్తసిక్త వనిత
నా కలం అగ్నిజ్వలిత కడ్గం
నా కాగితం అరుణవర్ణ మేఘం 
నా అక్షరం నిశ్పక్ష్య సాక్ష్యం 
                                       మహర్షి

Wednesday, August 17, 2011

నీ కన్నులు


నిన్నటి రాతిరి నా కలలొ
కదిలే నక్షత్రాలను చూసాను
ఎక్కడికో వేగంగా వెలుతునే వున్నాయి
నక్షత్రాలను అనుసరించి నేను అడుగులేసాను
అంతలో నీ కనుబొమ్మల గుమ్మాలను దాటి
నేరుగా నీ నయనాలయంలొ కొలువుతీరిపొయాయి 
అప్పుడే తెలిసింది నా మదిని బంధించే 
నీ కన్నులు  శతకోటి నక్షత్ర సమూహాలని...!
                                                         మహర్షి

Friday, August 5, 2011

నారంగు నలుపు.!


కాగితం తెలుపు కలానికి సిరా నలుపు
అక్షరాలు అల్లె సుద్దముక్క తెలుపు అది అల్లుకునే పలక నలుపు
నింగిలొ వెన్నెల తెలుపు అది తెలిపే చీకటి నలుపు
సప్తవర్ణాల నింగిరంగు చూపె నీ కంటి రంగు నలుపు 
మదిదోచే రగాలు కూసే కోకిల రంగు నలుపు 
వర్షించే మేఘాల రంగు నలుపు
అందుకే నలుపంటె నాకు ఎంతో వలపు 
మనసు రంగు వుంటె తెలుపు తెలుస్తుంది విలువెంతో నలుపు 
                                                                                       మహర్షి

Saturday, June 11, 2011

ఎలా.?


మేఘాలు లేనిది వర్షించేదెలా
తీరం లేనిది సంద్రం ఆగేదెలా
సూర్యుడు లేనిది ఉదయించేదెలా
చీకటి లేనిది చుక్కలు మెరిసేదెలా
జాబిలి లేనిది వెన్నెల కురిసేదెలా
సడి లేనిది మది సాగేదెలా
నీవు లేనిది నేను జీవించేదెలా...!
                                                 మహర్షి

Thursday, May 26, 2011

నిన్ను చేరేదారి



నిన్ను చేరేదారిలొ ఎన్నొ మైలురాళ్ళు 
లెక్కపెడుతు వచ్చాను నీ దరి చేరె క్షణాలు
కాలం మన ఇరువురి నడుమన గస్తికాస్తె 
కాలాన్ని కండించె ఖడ్గాన్నై
విస్పొటనంలా విజ్రుంబిస్తా 
ఓక నీటిభింధువు నన్ను ఆపాలని చూస్తే     
దండకరణ్యన్ని దహించిన ధావగ్నిని దండుగా మర్చి దహింపచేస్తా 
ఓక మంచుముద్ధ నన్ను ఎదురిస్తే 
సూర్యునిలా చెలరేగి చండ్ర నిప్పులు కురిపిస్తా 
ఫంచభూతాలు న పిడికిలిలొ బందించెసైన 
నీకై ప్రతిక్షణం పయనిస్తూనే వుంటా..   
                                                        మహర్షి


Saturday, May 21, 2011

నీవే నా బలానివి మరి..!


వేయి ఏనుగుల బలం కలవాడినే
అయినా నీ అందం ముందర పసిపిల్లడినే
సాహసానికే పాఠాలు చెప్పగల దైర్యశాలినే
అయినా నీ కళ్ళలోకి చూడలేని పిరికివాడినే
కొండలను సైతం పిండి చేయగల బలశాలినే
అయినా నీ విరుల కురుల నుండి రాలిపడ్డ 
           వెంట్రుకని మాత్రము లేపలేని బలహీనుడనే
కాలానికి కళ్లెంవేయగల  నేర్పరినే 
అయినా నీ సమక్షంలొ కనురెప్పైనా వెయలేని నిస్సహయుడినే 
అవును నీకు నేను బానిసనే  
అయినా ఏమిచేయను నీవే నా బలానివి మరి..!
                                                             మహర్షి

Friday, May 20, 2011


ముల్లు లేని రొజా వుండదు
విషాదం లేని ప్రేమ వుండదు
చీకటి లేని వెన్నెలా వుండదు
విరహం లేని ప్రణయం వుండదు
ఉరుము లేని వర్షం వుండదు
వేదన లేని వలపు వుండదు
సడి లేని మది వుండదు
నీవు లేని నేను వుండను..!
                                                               మహర్షి

Sunday, May 1, 2011

ఒంటరి


వెలుతురు లేని ఈ నిశిరాతిరిలో
మెరుపు లేని తారలు నింగిలో
అలుపు లేని పిల్లగాలి వీధిలో
నిదురలేని నేను నా గదిలో
నీ జ్ఞాపకాలు నా మదిలో
                                   మహర్షి

Tuesday, April 12, 2011

ఎలా మరవను.....?


ఎలా మరవను నిన్నటి క్షణాలను
నీవే అంతా అని
          అరమాట కుడా చెప్పకుండా అంతమైపొయావే
నాతొనే వుంటానని
           మంటల్లొ మసైపొయావే
నీవు పెట్టిన మొదటి ముద్దు 
                  అచ్చై మదిపై చెరగని మచ్చై మిగిలిపొయిందే  
స్నేహాన్ని ప్రేమని పొరబడిన నీ తప్ప
                       ప్రేమని స్నేహమని భ్రమపడిన నా తప్పా 
నీ తప్పని తెలిసి తప్పించుకునేందుకు తనువొదిలేసావా 
                        నా తప్పుకు శిక్షని ఒంటరిగా నన్నొదిలేసావా 
గడిచిన కాలానికి మన గురుతుల గిరకలు కట్టి వెనక్కి లాగనా 
                          లేదా 
మన అనుబంధాల అంచుల నుండి ముందుకు దూకనా...? 
                                                                                          మహర్షి

Sunday, March 13, 2011

తెలవారింది...


రబ్బర్ తొ తుడిచేసిన పేజీ లాంటి ఆకాశం
నల్లమబ్బుల మరకలు అక్కడక్కడ నిలిచిపొయాయి
చిల్లు పడిన చూరు నుండి ఒక్కొ చుక్క తొంగి చూస్తుంది
చంద్రుడి చెలి పౌర్ణమి వీడిపోయింది కాబొలు 
బక్కచిక్కి పొయాడు 
చీకటి నల్లటి దుప్పటి కప్పి 
అందరిని పడుకోమంది 
అప్పటివరకు సందేహంతొ సంకోచిస్తూ 
గుమ్మంలొ గస్తికాస్తున్న నిద్దుర 
ఆవలింత ఆహ్వానించగా 
పరిగెత్తుకు పక్కనొచ్చివాలింది 
అంతలొనే సూరీడు వెచ్చటి గొంతుతో
గట్టిగా పిలిచాడు తెలవారిందని 
మహర్షి

Sunday, February 27, 2011

ఆకు


పుడమిని చీల్చి పొడుచుకొచ్చిన ప్రతీ మొక్కకి అస్త్రం "ఆకు"
అది మానై ఎదిగిననాడు దాని మనుగడని పచ్చగా ప్రతిభింబించేది "ఆకు"
మహర్షి

నిన్నటి రొజులు


నా చుట్టు జనాలు 
అంతా నావాళ్లు(నా మిత్రులు)
పసందైన విందులు
అప్పుడప్పుడు చిందులు
కెఫుల్లొ టీలు
కాంపస్ లొ కబుర్లు
అనందమైన రొజులు 
అందమైన ఙ్నపకాలు


అంతలొనే ఎవరికివాళ్ల కుటుంబాలు
గుర్తొచ్చిన బాద్యతలు బందుత్వాలు
జీతాలిచ్చె జాబులు 
తీరిక లేని పనులు 
కలవలేని దారులు 
కరువైపొయిన నిన్నటి రొజులు 
మహర్షి

Friday, February 25, 2011

ఒంటరి పొరు



ఎక్కడైన ఎప్పుడైన ఒంటరి నేను ఒంటరి
భ్రమించె భూమి పరిభ్రమించె కాలం
మతిభ్రమిస్తూ నేను
నడిచిన దారుల తీరు యడబాటు తీరం
మౌనం నా స్నేహం మాటలు అబివార్యం
మనసేమొ మంటల పాలు నేనెమొ ఒంటరి పాలు
మురిపాలు,కొపాలు,తాపాలు
నాకు దక్కని శాపాలు
జనాల నోరు జడివాన జోరు
తట్టుకోలేని నా తీరు
వెనకెవరు లేరు దరికెవరు రారు
చెయ్యాలి ఒంటరి పొరు
మహర్షి

Monday, February 7, 2011

గర్జన


ఈ మద్యకాలంలో నేను మనిషినే చూడలేదు
జనాలంతా ఉద్యమాల జోరులోపడి
మనుషులము అన్నది మరీచారేమో
జంతువులలా అందరు గార్జిస్తున్నారే.....!


ఈ తర్జనబర్జన గర్జనలు ఎందుకయ్యా అంటే
దేశాన్ని దండుకునేందుకే అన్నాడోకడు  దర్జాగా.......
మహర్షి

Thursday, January 27, 2011

జై కొట్టు


ముచ్చటగా ముప్పైఒక్క రాష్ట్రాలు
అందరికి ప్రాంతీయ భేదాలు
ఒకవేయి ఆరువందల పద్దెనిమిది భాషలు
అందరివీ భిన్నమైన భావాలు
ఆరువేల నాలుగువందల కులాలు
ఒకరితో ఒకరికి కుమ్ములాటలు
ఆరు మతాలు 
అరవై గొడవలకు కారణాలు
ఇరవై తొమ్మిది పండుగలు
ఇందులో ఎఒక్కటి జరగవు లేకుండా రక్షక దళాలు
ఇవన్ని కలిసిన ఒక్క దేశం 
దయచేసి అందరు కలిసి ఉండాలి అన్నది నా సందేశం



రాష్ట్రాల కాలహం కట్టిపెట్టు 
ప్రాంతీయ భేదాలు పక్కన పెట్టు 
నీలో మానవత్వం బయటికి వచ్చేట్టూ


భాష దోషాలు వదిలిపెట్టు
మౌనంతో మాటకట్టు 
అందరికి అర్ధం అయ్యేట్టూ 


కుమ్ములాటల కులాలు క్రిందంటూ
మతాలు అన్ని మూటకట్టు
మానవత్వం రాజ్యమెలేట్టూ


దేశం అంతా ఒక్కటంటూ 
మనిషికి మనిషి ఉంటే కలిసి కట్టూ
ప్రతీ రోజు పండుగన్నట్టూ
భారత దేశానికి జై కొట్టు
 మహర్షి